39.2 C
Hyderabad
May 3, 2024 11: 33 AM
Slider హైదరాబాద్

సలాకపురి రాకేష్ కి డాక్టరేట్

#rakesh

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐటి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సలాకపురి రాకేష్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం లో తను వ్రాసిన థీసిస్ కు డాక్టరేట్ లభించింది . ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఇమేజ్ ప్రాసెసింగ్ యొక్క ఎడ్జ్ డిటెక్షన్ మరియు మూవింగ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ టెక్నిక్‌లను ఉపయోగించి ట్రాఫిక్ లైట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాంద్రతను కనుగొనే కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించినట్టు మరియు లెక్కించిన లైవ్ ట్రాఫిక్ డెన్సిటీ విలువల ఆధారంగా ట్రాఫిక్ లైట్లు నియంత్రించబడతాయని తెలిపారు . వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాగరత్న పి హెగ్డే మేడమ్ పర్యవేక్షణలో తన పరిశోధనను చేసినట్టు తెలిపారు. ఈ సందర్భం గా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీవీ నరసింహులు, ఐటీ విభాగం హెడ్ ప్రొఫెసర్ రజనీకాంత్ అలువాలు, మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు.

Related posts

పచ్చదనం పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి కావాలి

Satyam NEWS

“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “హో ఎగిరే” లిరికల్ సాంగ్ రిలీజ్

Bhavani

Leave a Comment