29.2 C
Hyderabad
May 10, 2024 01: 10 AM
Slider సంపాదకీయం

ఏపీలో ఖర్చు ఎంత? అప్పు ఎంత?

#jagan mohan reddy

జగన్ ప్రభుత్వం ఐదేళ్ల టరమ్ పూర్తి అయ్యే లోపు మరికెన్ని వేల కోట్ల రూపాయల అప్పు జత అవుతుందో అర్ధం కావడం లేదు. తాజాగా ఒక అంచనా ప్రకారం బహిరంగ మార్కెట్ రుణాలు, వేజ్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ లు, ఓవర్ డ్రాప్ట్ లు… అన్నీ కలిపి అప్పులు రూ 12.5లక్షల కోట్లకు చేరాయి.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ అప్పులు మాత్రం అనునిత్యం పెరిగిపోతూనే ఉన్నాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం చెబుతూ ఏపిలో అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని చెప్పారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపి అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని అంటున్నా వివిధ కార్పరేషన్ల ద్వారా చేసిన అప్పులే లెక్కకు మించి ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదంలేకుండా గత ఆర్ధిక సంవత్సరంలో రూ లక్షా 20వేల కోట్ల అప్పులు చేయడాన్ని కాగ్ తప్పుబట్టింది. కేంద్రం ఇచ్చిన నిధులు మురగబెట్టడంపై మండిపడింది.

నెలకు రూ 12వేల కోట్ల  చొప్పున ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్ల అప్పులు చేస్తున్నది జగన్ ప్రభుత్వం. కేవలం నాలుగు సంవత్సరాలలోనే 7,22,785 కోట్ల రూపాయల అప్పులు చేసిన సీఎంగా జగన్ రికార్డు సృష్టించాడు. తెచ్చిన అప్పులకే నెలకు రూ 3వేల కోట్ల పైన వడ్డీలు చెల్లించాల్సిన దుర్గతి పట్టించాడు. 5 నెలల్లో రూ 55వేల కోట్ల అప్పులు తెస్తే అందులో మూలధన వ్యయం రూ 7వేల కోట్లు లేదంటే వైసిపి ప్రభుత్వ ప్రాధాన్యతలేంటో తెలుస్తోంది.

ఏ ప్రభుత్వానికి అయినా సరే మూలధన వ్యయం కోసం నిర్దేశిత సూత్రాలు ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రగతిని సూచిస్తుంది. అయితే జగన్ ప్రభుత్వానికి ఈ లక్షణం కనిపించడం లేదు. మూల ధనం వ్యయంపై ఏ మాత్రం శ్రద్ధ చూపని రాష్ట్రం కూడా దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల కన్నా కూడా తక్కువ మూల ధన వ్యయం ఉన్న రాష్ట్రంగా ఏపి ఉన్నది.

మద్యం అమ్మకాలే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే ఆ ఆదాయం కంటే కూడా అప్పులు బాగా పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం సొంతంగా సంపాదించిన ఆదాయం రోజుకు రూ.322 కోట్లు. జగన్ ప్రభుత్వం చేసే అప్పులు రోజుకు రూ.439 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం కట్టే వడ్డీ రోజుకు రూ.70 కోట్ల 68 లక్షలు. ఇలా అప్పులు చేయడంలో రాష్ట్రం నిజంగా నెంబర్ వన్ గా నిలిచింది.

ఎఫ్ఆర్ బీఎం పరిధి కంటే రెండున్నర రెట్లు అధికంగా అప్పులు చేశారు. నెలసరి ఆదాయం కంటే చేసే అప్పులు 20 శాతంకు పైగా ఉన్నాయి. ఎఫ్ ఆర్ బీఎం పరిధి దాటి అప్పు చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడంలేదు. బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి తెచ్చినవి ఎఫ్ఆర్ బీఎం కిందకే వస్తాయి. ఏపీ రుణాలపై ఆర్ బీఐ కూడా నిబంధనలు పాటించదా? – కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి లేనిదే ఆర్ బీఐ ఇవ్వలేదు కదా? జగన్ అప్పులు చేస్తూనే ఉంటారు.. కేంద్రం చూస్తూనే ఉంటుంది. చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయో ప్రభుత్వం చెప్పాలి. విచ్చలవిడిగా చేసే అప్పులను తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలే కదా…

Related posts

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

పాకిస్తాన్ సెనేట్ లో వీగిపోయిన మనీ లాండరింగ్ బిల్లు

Satyam NEWS

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

Satyam NEWS

Leave a Comment