Slider కడప

డాక్టర్ పట్టా అందుకున్న రాజంపేట వాసి అనుపమ

#anupama

ఒక జర్నలిస్టు కుమార్తె అసాధారణ ప్రతిభ చూపి డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ కోర్సులో డాక్టర్ పట్టాపుచ్చుకున్నది. అన్నమయ్య జిల్లా రాజం పేటకు చెందిన ముదాం అనుపమ గురువారం సాయంత్రం కొడైకెనాల్ లో ఉన్న మదర్ తెరిసా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ పట్టా అందుకుంది. తమిళనాడు మదర్ థెరీసా యూనివర్సిటీలో డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ ఐదు సంవత్సరాల పీజీ కోర్సును పూర్తి చేసింది. యూనివర్సిటీ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించిన అనుపమ, డిస్టింక్షన్ లో ఉత్తీర్ణురాలయింది.

తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి చేతుల మీదుగా డాక్టర్ పట్టాను అందుకుంది. అనుపమ తండ్రి ముదాం రామచంద్రయ్య రాజంపేటలో సీనియర్ పాత్రికేయుడు. తల్లి పార్వతి గృహిణిగా ఉంటూ అనుపమా కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అనుపమ అన్న ముదాం భానుసాయి ఇప్పటికే బీడీఎస్ పూర్తి చేసి డెంటిస్ట్ వైద్యునిగా ఉన్నారు.ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి సారించాలని చెప్పారు. మన శరీరానికి కావలసిన డైట్ ఏది శక్తిని ఇస్తుందో ఎంత మోతాదులో తీసుకోవాలో అన్న విషయాలను ప్రజలకు వివరించి వారు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

సమ తుల్యమైన ఆహారం తీసుకొని కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో షుగర్, బిపి, ఉబకాయం వంటి ఎన్నో అనారోగ్య సమస్యల పాలవుతున్నారని వీటన్నింటినీ అధిగమించాలంటే డైట్ న్యూట్రిషన్ సమపాళ్లలో తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా బొందుగుల నారాయణరెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

Satyam NEWS

బ్యాంకుల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా CITU ర్యాలీ

Satyam NEWS

ఎన్నికల ప్రక్రియ పై అవగాహన ఉండాలి

Bhavani

Leave a Comment