38.2 C
Hyderabad
April 29, 2024 12: 12 PM
Slider నల్గొండ

బ్యాంకుల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా CITU ర్యాలీ

#CITUHujurnagar

భారతదేశ ప్రజల ఆస్తిని ప్రైవేటీకరణకు గురి కాకుండా దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళిన బ్యాంకు ఉద్యోగులు, వంద రోజులకు పైగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న రైతు సంఘాలకు సిఐటియు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మద్దతు తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో CITU ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో ప్రదర్శన చేసిన బ్యాంకు ఉద్యోగులకు, రైతులకు మద్దతుగా ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక సంస్కరణలను నిలిపివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రజలకు మేలు చేకూర్చే ప్రభుత్వ రంగ బ్యాంకులను కొనసాగించాలని, బ్యాంకుల లోని ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలని, వచ్చే నెల ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు, రైతులు ఓటు వేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా జరిగిన ఈ సమ్మెలో పది లక్షల మంది ఉద్యోగులు, వారితో పాటు రైసుమిల్లు కార్మికులు, మున్సిపల్ కార్మికులు, హమాలీలు, తదితరులు ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో యలక సోమయ్య గౌడ్,వెంకన్న,అంజి, కోటమ్మ, గోపమ్మ, దుర్గారావు, ముని వెంకన్న, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టం

Satyam NEWS

ప్రముఖ నటుడు బాలయ్య మృతి

Satyam NEWS

సదాశివ శర్మకు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

Satyam NEWS

Leave a Comment