26.7 C
Hyderabad
May 3, 2024 08: 09 AM
Slider నిజామాబాద్

విధులకు గైర్హాజరు… అయితే రిజిస్టర్లో మాత్రం సంతకాలు

#kamareddy

విధులకు రాకున్నా వచ్చినట్టుగా ఓ మెడికల్ ఆఫీసర్ చేసిన చీఫ్ ట్రిక్స్ బయటపడ్డాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి పిహెచ్ సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం కొంతమంది విలేకరులు సాధారణ వ్యక్తుల మాదిరిగా పిహెచ్ సికి వెళ్లి వివరాలు సేకరించగా ఈ ఘటన బయటపడింది. దేవునిపల్లి పిహెచ్ సీలో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుండగా అందులో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు విధులకు హాజరు కాలేదు.

ఉదయం రిజిస్టర్ లో చేసిన సంతకాలు

కానీ ఒక మెడికల్ ఆఫీసర్ విధులకు రాకున్నా వచ్చినట్టుగా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి వివరణ కోసం సంప్రదించగా ఫోన్లో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో కలెక్టర్ కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయడంతో ఓ సీనియర్ అధికారిని పంపిస్తానని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ చంద్రశేఖర్ ను విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పిహెచ్ సికి పంపించారు. మధ్యాహ్నం 1 గంటకు విచారణ అధికారి వచ్చేలోపు రికార్డులో చేసిన సంతకాన్ని కాస్తా సీఎల్(క్యాజువల్ లీవ్) గా మార్చేశారు.

విచారణ నిమిత్తం వచ్చిన అధికారి మాత్రం రికార్డులో తారుమారైన సంతకాన్ని చూసిచూడనట్టు వదిలేశారు. అదే విషయాన్ని జర్నలిస్టులు గట్టిగా ప్రశ్నించగా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ ఆఫీసర్ నుంచి వివరణ కోరతామని వెల్లడించి వెళ్లిపోయారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ ను వివరణ కోరగా సదరు మెడికల్ ఆఫీసర్ కు మెమో జారీ చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఉదయం రికార్డులో బుధవారం రోజు కూడా సదరు మెడికల్ ఆఫీసర్ విధులకు వచ్చినట్టుగా సంతకం చేశారు.

సంతకాలను సీఎల్ గా మార్చేసిన దృశ్యం

అయితే విచారణ జరిపేందుకు అధికారి వచ్చే లోపు సదరు మెడికల్ ఆఫీసర్ గురువారంతో పాటు బుధవారం కూడా సీఎల్ లో ఉన్నట్టుగా మార్చేశారు. ఒక మెడికల్ ఆఫీసర్ తన సంతకాన్ని గ్రీన్ పెన్నుతో చేస్తారు. ఇక్కడ కూడా ఆమె సంతకాన్ని గ్రీన్ పెన్నుతోనే చేసినా అదే గ్రీన్ పెన్నుతో చేసిన సంతకాన్ని సీఎల్ గా మార్చేశారు. మెడికల్ ఆఫీసర్ విధులకు రాకున్నా వచ్చినట్టుగా సంతకం చేయడం దేవునిపల్లి పిహెచ్ సి వైద్యులకు మాత్రమే చెల్లింది.

ఒకరి సంతకాన్ని ఇంకొకరు చేయడం అంటే మాములుగా ఫోర్జరీగా అభివర్ణిస్తారు. అయితే రాజకీయ పలుకుబడి ఉన్న ఆ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ కింద గుర్తిస్తారా లేక ఇతర కారణాలు చెప్పి వదిలేస్తారో చూడాలి. గత కొద్దిరోజులుగా సదరు మెడికల్ అధికారి ఇక్కడికి విధులకు రాకుండానే రిజిస్టర్ లో మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సంతకాలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలుంటాయా లేక మనకెందుకులే అని వదిలేస్తారా తేలాల్సి ఉంది. దేవునిపల్లి పిహెచ్ సి లో సిసి కెమెరా నిఘా ఉంది. సదరు మెడికల్ ఆఫీసర్ విధులకు హాజరవుతున్నారా లేదా హాజరైతే ఏ రోజు హాజరయ్యారు ఏ రోజు గైర్హాజరయ్యారు అనే వివరాలు పిహెచ్ సీలో ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తం అవుతాయి. అయితే అధికారులు సిసి ఫుటేజీ పరిశీలిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. నిష్పక్షపాత విచారణ జరిగితే మెడికల్ ఆఫీసర్ సంతకాల తతంగం మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయి.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

సువిధ యాప్ ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ

Bhavani

కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్ రాష్ట్రం మొత్తం 31 వరకూ షడ్డౌన్

Satyam NEWS

Leave a Comment