28.7 C
Hyderabad
April 28, 2024 08: 28 AM
Slider వరంగల్

మేడారం జాతర పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి

#medaram

మేడారం జాతర పనులు  పకడ్బందీగా పూర్తి చేయాలని ములుగు ఐ టి డి ఎ పి ఓ  అంకిత్ అధికారులను ఆదేశించారు. సమ్మక్క భవనం లో గురువారం ఐటీడీఏ పీఓ అంకిత్ జిల్లా ఉన్నత అధికారులతో మేడారం జాతర పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా అయిన  శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై జరిగిన ఈ సమావేశంలో ఎస్ పి శబరిష్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మాట్లాడుతూ  జాతర నిర్వహణలో మేడారం ప్రాంతాన్ని మొత్తం ఎనిమిది జోన్లుగా , 42 సెక్టార్లుగా విభజించామని వాటికి సంబంధించిన అధికారులను సైతం నియమించామని అన్నారు. జాతర సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో  అధికారులు పనులను జనవరి చివరి వారం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జాతర జరిగే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ములుగు జిల్లా  పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా అధికారులు పనిచేయాలని అన్నారు. జాతర నిర్వహణ మొత్తంలో నోడల్ అధికారులు మరియు సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని వారందరూ ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాలని  అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ప్రతి జోనల్ అధికారి తో గత అనుభవాల తో, జాతరలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో  పని చేయాలని అన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జాతర కు వచ్చే భక్తులకు ఈ నెల నుంచి వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా  వైద్య అధికారి అన్నారు. జాతర సమయంలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మేడారం జాతరకు వచ్చే రహదారులు మరమత్తులు కూడా త్వరలోనే పూర్తి చేయాలని అన్నారు. శానిటేషన్ పనులు విషయం లో  మండల అధికారులు, ప్రత్యేక అధికారులు  పర్యవేక్షణలో ఉండాలని  అన్నారు, జాతర కోసం ఆరు వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సు లను సిద్దం చేశాం అని అన్నారు.

గతం లో 3200 బస్ లు అందుబాటు లో ఉన్నాయని ఇప్పుడు మాత్రం 7 జిల్లాల నుంచి 6 వేల బస్ లను సిద్దం చేశాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో   అదనపు కలెక్టర్  రెవిన్యూ వేణు గోపాల్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి , డి ఎస్ పి రవీందర్,  డి పి ఓ వెంకయ్య , సంక్షేమ అధికారి ప్రేమలత ,  ఐటీడీఏ  అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వసంత రావు , విద్యుత్  శాఖ డీ ఈ నాగేశ్వర రావు, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప‌ని చేసిన కంపెనీలో దొంగ‌త‌నం..ఏడాది నుంచీ జ‌రుగుతున్న చోరీ

Satyam NEWS

ప్రకృతికి హారతి పడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న జనాన్ని చూసి పిచ్చెక్కిన వైసీసీ నేతలు

Satyam NEWS

Leave a Comment