28.7 C
Hyderabad
May 6, 2024 07: 43 AM
Slider ముఖ్యంశాలు

గుడ్ కాల్: డొనేట్ ఏ మాస్క్ సేవ్ ఏ నర్స్

Narsing Association

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్  కోవిడ్-19 వార్డ్ లో పనిచేస్తున్న నర్సులకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫేస్ మస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్  అసోసియేషన్ ముఖ్య సలహాదారులు చిలుపూరి వీరాచారి, వెల్ టెక్ ఫౌండేషన్ ఛైర్ మెన్ డాక్టర్ రామ్ తిలక్, ఇండియా, నేపాల్ పీస్ అంబాసిడర్ లు పాల్గొన్నారు.

వీరితో బాటు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీను రాథోడ్, పార మెడికల్ కో-ఆర్డినేటర్ వంశీ ప్రసాద్,  ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ తిలక్ మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఇచ్చిన డొనేట్ ఏ మాస్క్ సేవ్ ఏ నర్స్ అనే నినాదం కారణంగా తాము ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయం తో ఈ చిన్న సహాయం చేస్తున్నామని ఇంకా దాతలు ఎవరైనా  ముందుకు వస్తే కోవిద్ వార్డులలో పనిచేస్తున్న సిబ్బందికి  సహకరించిన వారవుతారని అన్నారు. చిలుపూరి వీరాచారి మాట్లాడుతూ దాత శరణ్య జోజీ కి నర్సింగ్ సమాజం తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ అకౌంట్ కు ఆర్థిక సహాయం పంపించగలరు. Welltech Foundation, A/c Number: 088701601000171, IFSC Code: CORP0000887, Bank: Corporation Bank, Branch: Malkajgiri, Hyderabad. సప్రదించవల్సిన ఫోన్ నంబర్లు: +91 95507 65346, 9700015427

Related posts

వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక విధానాల అమలు.. మంత్రి కేటీఆర్‌

Sub Editor

న్యూ బిగినింగ్: బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రెడ్డి

Satyam NEWS

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

Satyam NEWS

Leave a Comment