మూసీ నది తీర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేడు తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు, ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు,అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఆమె సుధీర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబరంగా, పేదల కోసం పనిచేసే వ్యక్తి సుధీర్ రెడ్డి అని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళలు, ఇతర నియోజకవర్గ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి సుధీర్ రెడ్డిని అభినందించారు.