42.2 C
Hyderabad
May 3, 2024 16: 40 PM
Slider నల్గొండ

అర్హులైన మేదరి కులస్తులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

#medaricast

తెలంగాణా రాష్టంలో మేదరి కులం  అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోర్రిగల శ్రీనివాస్ అన్నారు.

మేదరి కులం వారు ఉపయోగించే వెదురును సబ్సిడీపై అందించాలని, అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని,స్థలం ఉండి అర్హులైన మేదరి వారికి 3లక్షల రూపాయలు అందించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం మేదరి సంఘము సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు నోముల మల్లేశం అధ్యక్షతన స్థానిక పద్మశాలి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సులువ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్రం హైదరాబాద్ లో మెదరులకు ఉప్పల్ భగాయత్ లో స్థలము కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీర హరి కుమార్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణా రాష్టంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని దీనిని మెదరులలో అర్హులైన విద్యార్థిని,విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు కల్లూరి శోభారాణి,జిల్లా ఉద్యోగుల సంఘము అధ్యక్షుడు కోన రాంమల్లు,నల్గొండ జిల్లా అధ్యక్షుడు జోర్రిగల శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు కల్లూరి తిరుపతయ్య,సులువ యాదగిరి,పిల్లి యాదయ్య,కోన మల్లయ్య,నోముల నిరంజన్,పిల్లి శివశంకర్,కల్లూరి చిన నాగయ్య,జొర్రిగల జ్ఞానేశ్,కోన శివయ్య, నోముల నరేందర్,నోముల శ్రీనివాస్, కల్లూరి మురళీకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏప్రిల్ 21న 8వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

Satyam NEWS

తెలంగాణ వైభ‌వం ఉట్టిప‌డేలా బోనాలు

Satyam NEWS

తెలుగుదేశం పార్టీని వదిలేయాలనుకున్న కోడెల

Satyam NEWS

Leave a Comment