37.2 C
Hyderabad
May 6, 2024 14: 27 PM
Slider ఆదిలాబాద్

భారత ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన మహానీయుడు

nirmal collector 141

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి స్పూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 129వ జయంతి  పురస్కరించుకొని నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ వద్ద  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి అంబేద్కర్ అని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన మహనీయుడు నవభారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు.

అంబేద్కర్ ఆలోచన విధానాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని కృషి చేయాలన్నారు. కలెక్టర్ అంతకుముందు కలెక్టరేట్ లో భారతరత్న బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్ యాదవ్, ఆర్ డి ఓ ప్రసూనాంబ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్,  డి పి ఆర్ ఓ అబ్దుల్ కలీమ్, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, కలెక్టరేట్ ఏవో కరీం రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుజరాత్ పై గురి: ముడు పార్టీలు నువ్వా నేనా

Bhavani

జగన్ రెడ్డి ముసుగు తొలగింది: ఎన్ డీ ఏ సమావేశానికి ఆహ్వానం

Satyam NEWS

బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలపై..టీడీపీ ఆందోళన

Satyam NEWS

Leave a Comment