42.2 C
Hyderabad
May 3, 2024 16: 18 PM
Slider జాతీయం

జగన్ రెడ్డి ముసుగు తొలగింది: ఎన్ డీ ఏ సమావేశానికి ఆహ్వానం

#jagan

ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్ డీ ఏ కూటమి సమావేశం జరగనున్నది. ఎన్ డి ఏ కూటమి సమావేశం జరగడం విచిత్రం కాదు కానీ ఈ సమావేశానికి వైసీపీకి ఆహ్వానం అందింది. దాంతో జగన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా తయారైంది. ఇంత కాలం తెర వెనుక పూర్తి సహకారం అందించిన బీజేపీ ప్రభుత్వానికి తానూ సహకారం అందిస్తానని జగన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు చెప్పి వచ్చారు.

అయితే బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ రెడ్డి సుముఖంగా లేరు. అయితే ఇప్పుడు ఎన్ డి ఏ కూటమి సమావేశానికి వారు ఆహ్వానం పంపారు. దాంతో సీఎం జగన్ రెడ్డికి తంటా వచ్చిపడింది. అయితే ఈ సమావేశానికి హాజరు కావడంపై  జగన్ రెడ్డి సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు కేంద్రంతో మైత్రి వహిస్తున్న జగన్ కు కూటమి ఆహ్వానం మింగుడు పడకుండా వుంది. సమావేశానికి హాజరైతే రానున్న ఎన్నికల్లో మైనారిటీల వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం జగన్ రెడ్డిని వెంటాడుతోంది. హాజరు కాకపోతే కేంద్రం నుంచి సహాయ నిరాకరణ వుంటుందోమనన్న ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద కూటమి ఆహ్వానం జగన్ రెడ్డిని ఇరుకున పెట్టినట్లు అయింది. కూటమి సమావేశానికి జగన్ హాజరు అవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మిగిలింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరుగుతుంది.

అయితే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ పార్టీకి ఆహ్వానం వస్తుందనే ఊహాగానాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశం సందర్భంగా ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది.

అందుకే.. కేంద్ర, రాష్ర్టాల పార్టీలో మార్పులు, చేర్పులు చేశాక ఎన్డీఏ విస్తరణకు కసరత్తు పూర్తి చేసిన తర్వాతే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు రాష్ర్టాల పార్టీల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దలు.. రెండు మూడ్రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేయనుంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించిన వేళ ఎన్డీఏ ఇలా పార్టీలను ఆహ్వానించి మరీ మీటింగ్ పెట్టడం పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ఈ మీటింగ్ కి ఎన్ని పార్టీలు హాజరువుతాయి..? ఇంకా ఎవరెవరితో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది..? ఏం జరుగుబోతుందనేది వేచి చూడాల్సిందే..

Related posts

శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామికి త్రిదళ మారేడు లక్ష బిల్వార్చన

Satyam NEWS

ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 1 లక్ష 87 వేల కోట్ల ఖర్చు

Bhavani

ఐ.టి.ఐ అప్రెంటీస్ లకు జాబ్ మేళా

Satyam NEWS

Leave a Comment