38.2 C
Hyderabad
May 5, 2024 20: 44 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

bichkunda 141

బిచ్కుంద మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమసమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన  డాక్టర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారీగా ఉత్సవాలు జరపకుండా ఎక్కడి వారు అక్కడే గ్రామాలలో ఇళ్లలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మండల కేంద్రంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి అశోక్ పటేల్, గ్రామ పంచాయతి కార్యాలయంలో సర్పంచ్ శ్రీరేఖ రాజు, బండరెంజల్ గ్రామంలో సర్పంచ్ గడ్డం బాలరాజ్, గుండెనమిల్లి గ్రామంలో సర్పంచ్ రాణి కిష్టారెడ్డి పాల్గొన్నారు.

అలాగే వాజిద్నగర్ గ్రామంలో సర్పంచ్ అనుయా లక్ష్మీనారాయణ, పుల్కల్ గ్రామంలో వైస్ఎంపిపి రాజు పటేల్, పెద్దదేవాడ గ్రామంలో సర్పంచ్ శివ నందప్ప, చిన్న దడిగిలో సర్పంచ్ అనిత విఠల్ రెడ్డి, పెద్దదడిగి లో సర్పంచ్  సాయిలు, సీతారాంపల్లిలో సర్పంచ్ గంగారెడ్డి పాల్గొన్నారు.

అదే విధంగా ఫతలాపూర్ గ్రామంలో సర్పంచ్ అరుణ్ కుమార్, గుండె కల్లూరులో సర్పంచ్ సంగీత, బిచ్కుంద సొసైటీలో చైర్మన్ బాలాజీ మండల కేంద్రంలోని జగ్జీవన్రావు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దండోర నాయకులు అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

అనంతరం నిరాశ్రయులకు మతిస్థిమితం లేని వారికి బిచ్కుందా జగ్జీవన్రావ్ యూత్ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ ల పాటు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

పదిమంది ప్రాణాలు కాపాడినందుకు సీఎంకు రుణపడి ఉంటాం..!

Satyam NEWS

వాటెడ్ జస్టిస్: చిరువ్యాపారుల పొట్ట కొడితే ఎలా?

Satyam NEWS

ఇత్తడి.. పుత్తడని నమ్మించి మోసం.. పోలీసులు అదుపులో నిందితులు

Satyam NEWS

Leave a Comment