27.7 C
Hyderabad
May 4, 2024 09: 31 AM
Slider మహబూబ్ నగర్

అంబేద్కర్ విగ్రహ పునర్ ప్రతిష్టకు కొల్లాపూర్ లో కమిటీ

#ambedkar

కొల్లాపూర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ పునర్ ప్రతిష్టాపన, సుందరీకరణ కమిటీ కన్వీనర్ గా తిరుపతి రవీందర్ (బాలన్న) నియమితులయ్యారు. నేడు కొల్లాపూర్ పట్టణంలోని రాణి ఇందిరా దేవి ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అవుట జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన దళిత బహుజనుల ఆత్మీయ సమ్మేళనం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ పునర్ ప్రతిష్టాపన (సుందరీకరణ) కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సుందరీకరణ పనులకు అయ్యే ఖర్చులను SC&ST సబ్ ప్లాన్ నుంచి భరిస్తారు. ఈ మేరకు కొల్లాపూర్ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అతి సుందరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ పునర్ ప్రతిష్టాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. దీనికోసం ముందుగా కమిటీని నియమించారు.

కమిటీ కన్వీనర్ గా తిరుపాటి రవీందర్ (బాలన్న) కో -కన్వీనర్లుగా మానపాడు కృష్ణమూర్తి, బండల వెంకటస్వామి, కోడిగంటి నరసింహ, బొల్లి రఘుపతి, షేక్ అజ్మత్, ఎం.డి.రుక్మద్దీన్ కోశాధికారిగా కర్నే వాసుదేవ్ సలహాదారులుగా కర్నె శ్రీనివాస్(MEO), ధరూర్ ఎంపిడిఓ గడ్డం కృష్ణయ్య, PACS అధ్యక్షులు పెబ్బేటి కృష్ణయ్య, కె .శ్రీహరి అడ్వకేట్, బిజ్జవేణు, బండి శ్రీనివాస్, కర్నె శివయ్య సభ్యులుగా ఎం .కిరణ్, బి.అర్జున్, పి.స్వామి ఆడిటర్ కంటే రామస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

పెబ్బేటి కృష్ణయ్య బండల వెంకటస్వామి ,కురువ ఈదన్న, మానపాడు కృష్ణమూర్తి, కోడిగంటి నరసింహ, తగిలి వెంకటస్వామి ,ఉద్యోగ సంఘం నుండి K.రాజేందర్ K.చెన్నకేశవులు  K.శ్రీనివాస్ G.కృష్ణయ్య బండి ఆనంద్ కర్నే వాసుదేవ్ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

జగిత్యాల పట్టణ శివారు గ్రామాలను మాస్టర్‌ ప్లాన్‌ నుండి మినహాయిస్తాం

Bhavani

కారు ప్రమాద మృతురాలికి పరిహారం అందచేత

Satyam NEWS

ధాన్యం కొనరు కానీ ఎం‌ఎల్‌ఏ లను కొంటారట

Murali Krishna

Leave a Comment