40.2 C
Hyderabad
May 5, 2024 18: 17 PM
Slider కరీంనగర్

జగిత్యాల పట్టణ శివారు గ్రామాలను మాస్టర్‌ ప్లాన్‌ నుండి మినహాయిస్తాం

#Minister Koppula Eshwar

జగిత్యాల మున్సిపల్‌కు సంబందించి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సవరించి, రైతులకు, ప్రజలకు కించిత్‌ నష్టం లేకుండా చూస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పత్రిక ప్రకటనను జారీ చేశారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ విషయంలో కొద్ది రోజులుగా జగిత్యాల పట్టణ శివారులోని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో కలిసి గురువారం సాయంత్రం పత్రిక ప్రకటనను జారీ చేశారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ను మున్సిపల్‌ శాఖ ప్రకటించడంతో పాటు, ప్రజల వద్ద నుండి అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం అరవై రోజుల గడువును నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍లో జగిత్యాల శివారులో ఉన్న తిమ్మాపూర్‌, మోతె, నర్సింగాపూర్‌, అంబారిపేట, హస్నాబాద్‌, తిప్పన్నపేట గ్రామాల్లోని వ్యవసాయ భూములుగా ఉన్న కొన్ని సర్వే నెంబర్లను సైతం చేర్చారన్నారు.

మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍లో వ్యవసాయ భూముల్లో ఇండస్ట్రియల్‌, రిక్రియేషన్‌, పబ్లిక్‌, సెమి పబ్లిక్‌ జోన్లుగా చూపెట్టడంతో ఆయా గ్రామాల రైతులు, భూ యజమానులు ఆందోళనకు గురయ్యారన్నారు, డ్రాఫ్ట్‍లో దొర్లిన తప్పులతో రైతులు కొద్దిరోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారని, వారి ఆవేదన తమకు అర్థమైందన్నారు. మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ప్రస్తుతం ప్రకటించిన మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ను పూర్తి స్థాయిలో సవరిస్తామన్నారు.

డ్రాఫ్ట్‍లో ప్రైవేట్‌ వ్యక్తుల భూముల్లోను, పంట పొలాల సర్వే నెంబర్లలో చూపించిన ఇండస్ట్రియల్‌, రిక్రియేషన్‌, సెమి, పబ్లిక్‌, గవర్నమెంట్‌ జోన్లను తీసివేస్తామన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు, రైతుల భూముల్లో చూపించిన జోన్లను ప్రభుత్వ భూముల్లోకి మార్చు తామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీతో పాటు, శివారు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని, ఆ ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్‌, పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌, రిక్రియేషన్‌ తదితర జోన్లను తరలిస్తామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన డ్రాఫ్ట్‍ను పూర్తిగా సవరించి, కొత్త డ్రాఫ్ట్‍ను రూపొందించడానికి ఏర్పాట్లు

చేస్తున్నా మన్నారు. జగిత్యాలతో పాటు, శివారు గ్రామాల రైతులు మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ విషయంలో అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల భూముల్లో ఎలాంటి ఇబ్బందికర జోన్‌లు ఉండవని, రైతులకు కించిత్‌ ఇబ్బంది కాదని, రైతులు తమ భూమిలో ఒక గుంట భూమిని కూడా నష్టపోకుండా చూసే బాధ్యత తమదేనన్నారు. రైతులు ఆందోళనలను విరమించాలని ఆయన కోరారు.

Related posts

మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ

Bhavani

ప్రొబేషన్ డిక్లరేషన్ మహిళా సంర‌క్ష‌ణ పోలీసులకు త్వరలో శిక్షణ

Satyam NEWS

దేశంలోని మహిళలకు పెద్దన్నలా నిలిచిన నరేంద్రమోడీ

Satyam NEWS

Leave a Comment