28.7 C
Hyderabad
May 5, 2024 09: 41 AM
Slider ప్రపంచం

ఉగ్రవాదులే కాదు అక్కడ నుంచి మిడతలు కూడా

grasshoper

పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులే కాదు అక్కడ నుంచి వచ్చే మిడతలు కూడా మనకు తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తున్నాయి. పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న మిడతల దండు ఇండియాపై దండెత్తుతూ, గుజరాత్ లో పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి.

సమూహాలుగా వస్తున్న మిడతలు బనాస్ కాంఠా, మహసానా, కచ్, సాబర్ కాంఠా తదితర ప్రాంతాల్లో ఆవాలు, జీలకర్ర, బంగాళాదుంప, గోధుమ, జీలకర్ర, పత్తి తదితర పంటలను నాశనం చేస్తున్నాయి. డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం ద్వారా వీటిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ వీలు కావడం లేదు.

దీంతో పాటు పొలాల్లో టైర్లను మండించడం, డప్పులు వాయించడం, లౌడ్ స్పీకర్ల ద్వారా పెద్దగా సంగీతాన్ని వినిపించడం ద్వారా మిడతలను చెదరగొట్టవచ్చని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నా, పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రైతుల నుంచి నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో మిడతల కారణంగా పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.

బనాస్ కాంఠా జిల్లాలో ఈ మిడతల కారణంగా ఇప్పటివరకూ 5 వేల హెక్టార్లలో పంట నాశనమైంది. మిడతలను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం నానా తంటాలూ పడుతుండగా, సమస్య తీవ్రతను గమనించిన కేంద్రం, 11 బృందాలను రాష్ట్రానికి పంపింది.

Related posts

ఉన్న పెన్షన్లు కూడా కట్ చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

బద్వేల్ ఉప ఎన్నికల్లో నేను పోటీ చెయ్యడం లేదు

Satyam NEWS

వి ఎస్ యూ లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Bhavani

Leave a Comment