40.2 C
Hyderabad
May 6, 2024 16: 18 PM
Slider ముఖ్యంశాలు

క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యo వహిస్తే ప్రతిఘటన

#drivers

తడి చెత్త, పొడి చెత్త సేకరించే క్లాప్ వెహికల్ డ్రైవర్లకి జీఓ ల ప్రకారం కనీస వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ చెల్లింపుల్లో కోతలు పెట్టి, వారాంతపు సెలవులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు వేధింపులతో, బ్లాక్మైల్ తో వెట్టి చాకిరీ చేయించుకుంటారా అని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్. రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే జీఓ నెంబర్ 7 ప్రకారం… వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఎ.పి క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో క్లాప్ వెహికల్ డ్రైవర్ల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంకై  యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.

అనంతరం స్పందనలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆమె తక్షణమే స్పందించి డీసీఎల్ ని సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి నాయకత్వం వహించిన నేతలు ఎస్.రంగరాజు, బుగత అశోక్ లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ సంకల్పం అనే నినాదంతో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో చేపటీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నామని చెప్పి ప్రయివేటు ఏజెన్సీ కాంట్రాక్టర్లుకి అప్పగించి దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.

కాంట్రాక్టర్లు నిబంధనలకి విరుద్దంగా విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్లో 60 సచివాలయాల పరిధిలో పని చేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా వేతనాలు చెల్లించకుండా, ఇస్తున్న వేతనల్లో, పి.ఎఫ్ ల్లో కోతలు విధిస్తూ, అడిగేవాడిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ అనేక ఇబ్బందులు పెట్టడం చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12,500 చెల్లిస్తే ఆటో డ్రైవర్లకు కేవలం 10 వేలు రూపాయల మాత్రమే చెల్లిస్తే మిగతా డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయని ప్రశ్నించారు.

డ్రైవర్లుకి రాష్ట్ర ప్రభుత్వం 18,500 వేతనం చెల్లిస్తామని జీఓ నెం 7 విడుదల చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ జీఓ లను, నిబంధనలను భేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. పిఎఫ్ చెల్లింపుల్లో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయన్నారు. క్లాప్ ఆటో డ్రైవర్ కు ప్రమాదం జరిగిన తమ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టానికి తగిన జీతం ఇవ్వకపోగా వాహనాలు మరమ్మతులు వస్తే అభారం డ్రైవర్లు మీద వేయడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు.

ఈ సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు లేనిపక్షంలో రాబోయే కాలంలో దశల వారి పోరాటాలు నిర్వహణలో భాగంగా వాహనాలు నిలిపి ఆందోళనలు ఉదృతం చేస్తామని, ఆ తరువాత జరగబోయే పరిణామాలకు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాళ్ళ అశోక్, కె.సంతోష్, సహాయ కార్యదర్సులు ఏ. శ్రీనివాసు, కె రవి, కోశాధికారి ఆర్. సౌరి , విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్లో 60 సచివాలయ పరిధిలో పని చేస్తున్న డ్రైవర్లు పాల్గొన్నారు.

Related posts

అంబటి జగన్ ను వీడి వెళ్లడానికి వెనుక అసలు కథ ఇది

Satyam NEWS

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS

Leave a Comment