42.2 C
Hyderabad
April 30, 2024 17: 25 PM
Slider విజయనగరం

ఈ సారి పోలీసు “స్పందన” ప్రత్యేకంగా…!

#spandana

విజయనగరం ఎస్పీ బదులు… ఇంచార్జ్ డీఎస్పీ…! బాస్ ఆదేశాలతో ఫిర్యాదులు స్వీకరణ…!

విజయనగరం జిల్లా  పోలీసు బాస్ అంటే ఎస్పీ ఎం.దీపిక, ఆదేశాలతో విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు “స్పందన” కార్యక్రమం  నిర్వహించారు.

ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను డిఎస్పీ ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ 20 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరం కి చెందిన ఒక వ్యక్తి డిఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తనకు రౌతువీధిలో గల స్వంత ఇల్లు కలదని, సదరు ఇంటికి ప్రక్కనున్న వ్యక్తి నూతనంగా నిర్మించు కొనేందుకుగాను తన ఇంటి కొంత భాగాన్ని ధ్వంసం చేసినట్లు, తిరిగి సదరు ఇంటికి మరమ్మత్తులు చేయమని కోరినప్పటికీ, స్పందించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ జరిపి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, బాధితుడికి న్యాయం చేయాలని 1వ పట్టణ సిఐను ఆదేశించారు.

విజయనగరం బిసి కాలనీకి చెందిన ఒక వ్యక్తి డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తాను స్థలం కొనుగోలు చేసేందుకుగాను శివాలయం వీధికి చెందిన వ్యక్తికి అడ్వాన్సుగా లక్ష చెల్లించినట్లు, కానీ సదరు వ్యక్తి స్ధలాన్ని అమ్మడం లేదని, తాను అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చేయమని అడిగినప్పటికీ ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేసి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.

అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తనకు భోగాపురం మండలం కొవ్వాడ రెవెన్యూ పరిధిలోగల స్థలంను వేరే వ్యక్తులకు అన్యాక్రాంతం చేసేందుకు రికార్డులను తారుమారు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని భోగాపురం సిఐను ఆదేశించారు.

అప్పు తీసుకున్న పాపానికి అధిక వడ్డీ….

విజయనగరం కు చెందిన ఒకామె డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమ ఆర్ధిక అవసరాలను తీర్చు కొనేందుకుగాను ఒక వ్యక్తి వద్ద నుండి  5 లక్షలు రుణంగా తీసుకున్నట్లు, సదరు వ్యక్తి అధిక వడ్డీ వసూలు చేస్తూ, తమను వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం 2వ పట్టణ సిఐను ఆదేశించారు.

విజయనగరం వీటి అగ్రహారంకు చెందిన ఒక వ్యక్తి డిఎస్పీ ఫిర్యాదు చేస్తూ తనకు రాత్రుళ్లు ఒక వ్యక్తి ఫోను చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనరం రూరల్ సిఐను ఆదేశించారు.

ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే జిల్లా ఎస్పీ కి నివేదించాలని అధికారులను డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బి సీఐ జె. మురళి, ఎస్బీ సీఐలు రుద్రశేఖర్, జి.రాంబాబు, ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

క్వశ్చన్ అవర్: బిజెపితో హనీమూన్ పిరియడ్ ముగిసిందా?

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టినందుకు టీడీపీ నేత అరెస్ట్‌

Satyam NEWS

కేసీఆర్ ని కలిసిన పువ్వాడ

Bhavani

Leave a Comment