37.2 C
Hyderabad
May 2, 2024 14: 25 PM
Slider నల్గొండ

వాహనదారులకు సూచనలు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి

#drunkanddrive

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్,వెహికల్ చెకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, మైనర్ లకు ఎట్టి పరిస్థితిలో వాహనాలు ఇవ్వవొద్దని,నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపవద్దని,ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించాలని,ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించారు.ప్రతిఒక్క వాహణదారుడు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చాలానలను ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆఫర్ పీరియడ్ లో క్లియర్ చేసుకోవలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై,సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఆరోగ్యం బాగాలేదు దయచేసి నన్ను వదిలేయండి

Satyam NEWS

సెప్టెంబర్ 12 నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు

Bhavani

బెయిల్ పై ఉన్న ఈ సీఎం అందరిని జైలుకు పంపాలని చూస్తున్నాడు

Satyam NEWS

Leave a Comment