34.7 C
Hyderabad
May 4, 2024 23: 18 PM
Slider విజయనగరం

మిట్ట మధ్యాహ్నం.. నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

#drunkanddrive

మద్యం అమ్మకాల ద్వారా జగన్ సర్కార్…ఆదాయం పెంచుకోవాలని..మరో వైపు… పోలీసు ఉన్నతాధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని.. రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తర్వులు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం కాస్త తగ్గినట్టు ఆబ్కారీ శాఖ నివేదికలు చెబుతున్నాయి.మరో వైపు… రోజు వారీ…అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు… డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టాలని గడచిన కొద్ది రోజుల నుంచే పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు, సూచనలు రావడం తో ఇక లాభం లేదనుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల్లో అటు ట్రాఫిక్ ఇటు లా అండ్ అర్డర్ విభాగాలు డీడీ పై దృష్టి పెట్టాయి.

అందులో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ సూచనలతో నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ, ఎత్తు బ్రిడ్జి, రైల్వే స్టేషన్, సీఎంఆర్ ,మూడులాంతర్లు ,కోట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ లు లోవరాజు, త్రినాథ్, రాజులు…డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ముగ్గురు వ్యక్తులు… అదీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి బాలాజీ జంక్షన్ నుంచీ రయ్యా…రయ్యీ మంటు వెళుతున్న వెహికిల్ ను ట్రాఫిక్ ఎస్ఐ రాజు చూసి.. ఆపేందుకు యత్నించిన తప్పించుకు పోయారు.

వెంటనే మ్యాన్ ప్యాక్ ద్వారా… ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్, అవుట్ గేట్ వద్ద ట్రాఫిక్ సిబ్బంది ని అలెర్ట్ చేయడంతో కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద దొరికిపోయారు.డీడీ మిషన్ ద్వారా టెస్ట్ చేస్తే మోతాదు కు మించి మద్యం సేవించి నట్టు డీడీ మిషన్ చూపించింది. ఇక లాభం లేదనుకుని… ట్రాఫిక్ ఎస్ఐ ఏ.మహేశ్వర రాజు…కేసు నెంబర్ 903 నమోదు చేసి.. బండితో సహా ఆ ముగ్గురు ని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను పంపించారు. ఏదైనా… జిల్లా పోలీసు బాస్ ఆదేశాలతో కొత్తగా వచ్చిన ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ ఆద్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు.. ఈ వారంలో ఇలా పని చేయడం మూడోసారని “సత్యం న్యూస్. నెట్” అంటోంది.

Related posts

మేడారం మహా జాతర తేదీల ఖరారు

Satyam NEWS

సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్య కార్మికుల నిరసన

Satyam NEWS

సంక్రాంతి సందర్భంగా అమరావతిలో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment