Slider నిజామాబాద్

డ్రంక్ అండ్ డ్రైవ్: రెండు బైకులు ఢీ ముగ్గురికి గాయాలు

#Drunk and Drive

బిచ్కుంద బాన్సువాడ రహదారిపై ఉన్న ఐటిఐ కాలేజీ వద్ద బుధవారం రాత్రి అతి వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం వాజిద్ నగర్ గ్రామానికి చెందిన గంధం శైలేష్(28) బిచ్కుంద నుండి వాజిద్ నగర్ వెళుతుండగా ప్రమాదం జరిగింది.

ఎదురుగా బాన్సువాడ నుండి జుక్కల్ గ్రామానికి వెళ్తున్న తండ్రి కొడుకులు చెట్టు కింద హనుమాన్లు(60), మారుతి(20) ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు బాన్స్వాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శైలేష్ మద్యం సేవించి ఉన్నాడని తలకు తీవ్రంగా గాయాలు కాగా, హనుమాన్లు కాలు విరిగింది అని అతని కొడుకు మారుతి చేతికి దెబ్బ కలిగిందని అని 108 సిబ్బంది సుభాష్ తెలిపారు.

Related posts

హైకోర్టులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఊరట

Satyam NEWS

Analysis: దుబ్బాక భంగపాటుతో దిద్దు ‘పాట్లు’

Satyam NEWS

‘గొడ్డలి వేటు’తో రాయలసీమలో కూడా వైసీపీ గల్లంతు

Satyam NEWS

Leave a Comment