30.3 C
Hyderabad
March 15, 2025 10: 09 AM
Slider నల్గొండ

డిమాండ్: వలసకూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

#CPM Chityala

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కాలినడకన వెళుతున్న వలస కార్మికులను గుర్తించి ఉచితంగా ప్రయాణం,  భోజన సదుపాయం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని CPM జిల్లా నాయకులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. గురువారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణ కేంద్రం లోని CPM కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లే కార్డ్ లు చేబట్టి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య, పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు, పోలీస్ లకు అదనపు సౌకర్యాలతో ఆరోగ్య రక్షణ కల్పించాలని కోరారు. నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే అందించి ఆదుకోవాలని,రేషన్ కార్డు లేని పేదలకు కూడా బియ్యం, డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వృత్తిదారులు,చిన్న వ్యాపారులకు పని చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని, మద్యం నిషేదించి,రెడ్ జోన్ ప్రాంతాలలో అందరికీ కరోనా టెస్ట్ లు చేస్తూ,అన్ని రకాల జబ్బుల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో అన్నిరకాల రోగాలకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, గుడిసె లక్ష్మి నారాయణ, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దలు, చంద్రమౌళి, రమణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

AITUC శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS

కర్నూలు జిల్లాలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు

Satyam NEWS

వేధించిన యువకులకు ఉరి వేసుకుంటూ వాట్సప్

Satyam NEWS

Leave a Comment