హైదరాబాద్ శివారు ప్రాంతమైన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నేడు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడి Jeevika Life Sciences Pvt Ltd కెమికల్ కంపెనీలో రియాక్టర్ ల పేలుడు కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. లోపల చిక్కుకున్న ఇద్దరు కార్మికులు మరణించారు. మరో 4 గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రి కి తరలించారు. రియాక్టర్ భారీ శబ్దంతో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుతో కంపెనీ రేకులు తూనతునకలు అయ్యాయి. కంపెనీ దగ్గరకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.