31.2 C
Hyderabad
May 3, 2024 01: 14 AM
Slider పశ్చిమగోదావరి

అభివృద్ది దశలో రాజమహేంద్రవరం ముందంజ

#Rajamahendravaram

ప్రతి వార్డు పరిధిలో కోటి రూపాయలు మేరకు , అపై ఎంత అవసరం అవుతుందో ఆమేరకు అభివృద్ధి పనులు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు,సోమవారం 31వ వార్డు లో పనులు ప్రారంభించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ అన్నారు. సోమవారం అజాక్ చౌక్ వద్ద గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 31వ వార్డ్ లో కోటి రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రానున్న రోజుల్లో వార్డుల వారీగా అభివృద్ధి పనులు వివరాలు తెలియ చేసే పోస్టర్ ను ఆవిష్కరించారు. 31 వ వార్డులో ప్రత్యేక అభివృద్ధి నిధులు రు.45 లక్షలు, సాధారణ నిధులు రూ.35 లక్షలు, జీజిఎంపి నిధులు రూ.20 లక్షలతో పనులకు శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 175 నియోజక వర్గాల పరిధిలో ఉన్న ఏ నగరంలో కూడా జరగని విధంగా అభివృద్ధి పనులు రాజమహేంద్రవరం లో జరుపుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్లడం జరుగుతోంద న్నారు. తొలిదశ లో రూ.76 కోట్ల మేర పనులు జరుగుతున్నాయని తెలిపారు. గడప గడపకు తిరిగి వారి స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ది తో పూర్తి చేస్తామని అన్నారు. యువకుల మైన నగర పాలక సంస్థ కమిషనర్ తను పరస్పర అవగాహన తో అభివృద్ధిలో నగరాన్ని ముందు వరసలో నిలడం లో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పనులు చెయ్యడంలో ప్రజా ప్రతినిధి – అధికారి ఇద్దరి మనోభావాలు కలిస్తే ఏవిధమైన అభివృద్ధి సాధ్యమో నేడు నగరంలో చేస్తున్న పనులు ద్వారా చూపిస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను మరింతగా తెలుసుకుని, వారి సూచనలు పరిగణన లోకి తీసుకుని నగర అభివృద్ధి, శానిటేషన్ , సుందరీకరణ, తదితర పనులను భారీ ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు.

ఇంకా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి గానీ, అధికారుల దృష్టికి తీసుకుని వొస్తే వారి సమస్యలు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, మదనసింగ్ పేట లో రూ.30 లక్షలతో సిసి రోడ్,అన్నపూర్ణ పేట – మదనసింగ్ నగర్ లో రూ.15 లక్షలతో సిసి రోడ్ & డ్రైన్, అన్నపూర్ణ పేట లో రూ.5 లక్షలతో సిసి రోడ్ & డ్రైన్, ఆజాద్ జంక్షన్ వద్ద రూ.19.60 లక్షలతో అభివృద్ధి పనులు, మంచినీటి విభాగం పనులలో భాగంగా కోత్త పైపు లైన్లు తదితర పనులకు అన్నపూర్ణ పేట లో రూ.15 లక్షలు, అన్నపూర్ణమ్మ పేట – మదన్ సింగ్ పేట రు.8.40 లక్షలు, ఆజాద్ చౌక్ వద్ద రూ.7.00 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా వార్డుల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయలు వారీగా ప్రజా ప్రతినిధులు పర్యటించి తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం తగిన మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కోటి రూపాయలు మేర పనులకు మంజూరు చేస్తున్నామని, ఆ వార్డుల్లో ఎంత మేర అవసరమో ఆమేర శాంక్షన్ చేస్తామన్నారు.

రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, గతంలో తాత్కాలిక అభివృద్ధి జరిగితే, నేడు ఎంపి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూశారన్నారు. నేడు మనకు శాశ్వత అభివృద్ధి పనులు జరగడం ముఖ్యం అని, ఆ దిశలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు.

ఈ సందర్భంగా 42 వార్డ్ లులో మంజూరు చేసిన పలు అభివృద్ధి పనుల వివరాలతో పోస్టర్ లాంచ్ చేసి,తదుపరి 31వ వార్డ్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ పాండురంగ రావు,మజ్జి అప్పారావు,నూకరత్నం,పాలిక శ్రీను, వక్స్ బోర్డ్ జిల్లా అధ్యక్షులు అరిఫ్,హభిబుల్లా ఖాన్, అరిఫుల్ల ఖాన్,అమనుల్లా ఖాన్,పిల్లి నిర్మల,పాలేపు శ్రీను,అడపా శ్రీహరి, మార్తి లక్ష్మి, పెంకె సురేష్ కుమార్,బురిడీ త్రిమూర్తులు, కొమ్ము జగ్లర్,గోంటుముక్కల రాజు,హసీనా,పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీరియస్ ఎలిగేషన్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మతి భ్రమించింది

Satyam NEWS

జాతి ప్రయోజనాల కోసం త్యాగశీలి సంత్ సేవాలాల్ మహారాజ్

Satyam NEWS

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

Satyam NEWS

Leave a Comment