39.2 C
Hyderabad
May 4, 2024 20: 43 PM
Slider సంపాదకీయం

కరోనా అనుమానంతో దుబాయ్ విమానం నిలిపివేత

kochine airport

బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ రావడంతో దుబాయ్ వెళ్లాల్సిన విమానంలోని ప్రయాణీకులు అందరిని దించివేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల కిందట కేరళలోని మున్నార్ కు విహార యాత్రకు వచ్చాడు. అతని తో బాటు 19 మంది ఉన్నారు.

అందరూ హాలిడే ను ఆనందంగా గడుపుతున్న సమయంలో అందులోని ఒకరికి కోవిడ్ 19 సోకింది. అతడు మున్నార్ లోని ఆసుపత్రికి వెళ్లగా అతనికి పరీక్షలు జరిపి జాగ్రత్తలు చెప్పారు. వైద్య పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అయితే అతను వినకుండా మున్నార్ నుంచి కొచ్చిన్ ఎయిర్ పోర్టుకు వచ్చేశాడు.

కొచ్చిన్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అతను అతనితో బాటు ఉన్న 19 మంది విమానం ఎక్కేశారు. ఈ లోపు అతని టెస్టు ఫలితాలు వచ్చాయి. అతనికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలడంతో వైద్యాధికారులు మున్నార్ లోని అతను బస చేసిన హోటల్ కు కబురు చేశారు. అయితే అప్పటికే అతను వెళ్లిపోయాడని కొచ్చిన్ విమానాశ్రయంలో ఉండి ఉంటాడని చెప్పారు. దాంతో హుటాహుటిన పోలీసులు రంగంలో దిగారు.

అతడిని కొచ్చిన్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. అతనితో బాటు ఉన్న 19 మందిని కూడా విమానం దించేశారు. పరీక్షలకు పంపారు. అయితే మరింత అనుమానం రావడంతో విమానంలో ఉన్న మొత్తం 289 మందిని కిందికి దించేశారు.

అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో కొచ్చిన్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానం మొత్తం రద్దయింది. ప్రయాణీకులు అందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఒక వ్యక్తి వల్ల ఇంత జరిగింది. నిన్న ఇలాంటి సంఘటననే సత్యం న్యూస్ వివరించింది.

దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కల్బుర్గికి వెళ్లాడు. అక్కడ జ్వరం రావడంతో అక్కడి జెమ్స్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. అక్కడ తనకు సరిగా పరీక్షలు నిర్వహించడం లేదని కల్బుర్గి నుంచి హైదరాబాద్ వచ్చాడు. కేర్ బంజారాలో చేరి అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి పంపుతారేమోననే అనుమానంతో మరో రెండు ప్రయివేటు ఆసుపత్రులకు తిరగాడు.

మొత్తం 100 మందికి కరోనా వైరస్ అంటించి తిరిగి కల్బుర్గి వెళుతూ మార్గమధ్యంలో మరణించాడు. చదువుకున్న వారు కూడా ఇంత మూర్ఖంగా చేస్తుండడం వల్లే కరోనా వైరస్  వ్యాప్తి చెందుతున్నది. కరోనా లక్షణాలు ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలో ఉండి వారు చెప్పినట్లు నడచుకుంటే ఎలాంటి సమస్య వారికే కాకుండా మిగిలిన వారెవ్వరికి కూడా రాకుండా ఉంటుంది.  

Related posts

Analysis: దక్షిణాది కైవసానికి ఆట మొదలెట్టిన మోడీ

Satyam NEWS

నిర్మ‌ల్ లో వైభవంగా గణేష్ శోభాయాత్ర

Satyam NEWS

విద్యార్ధుల బుద్ధి కుశలతకు పదును పెట్టే చదరంగం

Satyam NEWS

Leave a Comment