స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాదు, రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 1% కూడా నామినేషన్ రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవు. ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది.
అందుకు భయ పడిన ఈ వైసీపీ ప్రభుత్వం నామినేషన్లను రిజెక్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిపితే 75%మెజారిటీతో టిడిపి గెలుస్తుంది అని ఆయన అన్నారు. దేశంలో ఇంత దరిద్రమైన ఎలక్షన్ ఎప్పుడూ జరగలేదని, అధికారులు, పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాయడం దారుణమని ఆయన అన్నారు.