ఎన్నికలు వాయిదా వేయడం కాదని ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ స్పందించారు.
రాష్ట్రంలోని అన్ని చోట్లా భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందని ఆయన అన్నారు. భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.