41.2 C
Hyderabad
May 4, 2024 18: 56 PM
Slider ముఖ్యంశాలు

హుజూర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన బిఎస్పీ టి ఎస్ చీఫ్ కో-ఆర్డినేటర్

#rspraveenkumar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని డంపింగ్  యార్డ్ ను మంగళవారం బిఎస్పీ టి ఎస్ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 150 కోట్ల రూపాయలతో దాదాపు 2150 వేల ఇందిరమ్మ గృహాలు  నిర్మించి దాదాపు10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పేద ప్రజలకు పంచకుండా దుర్మార్గంగా వ్యవరిస్తున్న పాలక వర్గాలపై తిరుగుబాటు తప్పదని, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మఠంపల్లి మండల కేంద్రంలో మహిళలు ఇంకా మరుగుదొడ్లు కావాలని వినతిపత్రాలు ఇస్తూ,పోరాటాలు చేసే పరిస్థితి ఉందంటే పాలకులు ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఒకసారి ప్రజలు అర్ధం చేసుకోవాలని,అందుకే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు తప్పకుండా ఇండ్లు పంచి పెడతామని,మహిళలకు పెద్దపీట వేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బహుజన్ సమాజ్ పార్టీ ఇంచార్జ్ డా॥సాంబశివగౌడ్,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి,నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది నరసింహారావు,కస్తాల కిశోర్,జిలకర రామస్వామి,వాస పల్లయ్య,పిడమర్తి శీను,శోభ,గోవిందు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గుడ్ డెసిషన్: మేడారం లో ప్లాస్టిక్ ను నిషేధిద్దాం

Satyam NEWS

లాక్ డౌన్ కు ఏడాది..

Satyam NEWS

నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది

Satyam NEWS

Leave a Comment