29.7 C
Hyderabad
May 6, 2024 05: 04 AM
Slider నల్గొండ

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్

#aisf

ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని,ఈ నెల 20న, ఇచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభమై నేటికి నెల రోజులు కావస్తున్నా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా,విద్యార్థులకు ఇవ్వవలసిన పుస్తకాలు ఇవ్వకుండా కొద్ది పుస్తకాలతో విద్యార్థులకు ఏ విధంగా నాణ్యమైన విద్య అందిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా సరైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరిపడా పుస్తకాలు,ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు,స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని ఈ నెల 20న,వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగిందని అన్నారు.

వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్స్

తక్షణమే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,దుస్తులు అందించాలి.

మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి,నాణ్యత పాటించాలి.

ప్రభుత్వ పాఠశాలలో స్కావేంజర్ పోస్టులు భర్తీ చేయాలి.

ఖాళీగా ఉన్న బోధన,బోధనేతర   పోస్టులు భర్తీ చేయాలి.

కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులను నియంత్రించాలి.

ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌళిక వసతులు మెరుగు పరచాలి.

విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్ లు ఇవ్వాలి.

విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం ఎన్.ఈ.పి.2020 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చేపూరు కొండల్,పి డి ఎస్ యు జిల్లా  కార్యదర్శి మాలోతు చందర్రావు, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరేష్,పి డి ఎస్ యు,ఎఐఎస్ఎఫ్ నాయకులు నందు, సిపాయి, వెంకటేష్, సాయి, గోపి, సంతోష్, చందు,నాగు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఓ వైపు జోరుగా వాన ఇక జెండా ఎగిరేది ఎలా?

Satyam NEWS

భారతదేశం గర్వించదగ్గ సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం

Satyam NEWS

కూలీలకు, చేతి వృత్తిదారులకు నెలకు పది వేలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment