27.7 C
Hyderabad
May 4, 2024 10: 49 AM
Slider నల్గొండ

ఉద్యోగులకు నిరుద్యోగులకు ఆశాకిరణం రాములు నాయక్

#CongressParty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ముస్లిం మైనారిటీ,వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో,  ప్రైవేటు విద్యాసంస్థలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు MLC రాములు నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.  TPCC రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి,PCC జాయింట్ సెక్రటరీ MD అజీజ్ పాషా,INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు మాట్లాడుతూ సమ‌స్య‌ల‌ను ప్ర‌శ్నించ‌డంలోను రాములు నాయక్ ముందుంటాడని, శాసనమండలిలో ప్ర‌శ్నించే గొంతు ఉంటేనే స‌ర్కారు సరిగా ప‌నిచేస్తుందని అన్నారు.

స‌ర్కార్‌ను ప్ర‌శ్నించే గొంతు‌కలైన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని, అప్పుడే ప్రభుత్వం DSC నోటిఫికేషన్, గ్రూప్-1 నోటిఫికేషన్లను, నిరుద్యోగ భృతి,ఉద్యోగస్తులకు పూర్తిస్థాయి పీఆర్సీ అమలు కోసం ప్రధాన ప్రతిపక్షంగా మండలిలో ప్రశ్నిస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కొరకు  

మండ‌లిలో ప్ర‌శ్నించే గొంతును ఎన్నుకుంటే మిగిలిన రెండేళ్ల కాలంలో టీఆర్ఎస్ స‌ర్కార్‌ ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉందని అన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 77 అసెంబ్లీ స్థానాలు ప్ర‌భావితం అవుతాయ‌ని, కనుక ఓటు వేసే ముందు ఒక్క‌సారి ఆలోచించాల‌ని కోరారు. ఆరేళ్లుగా యూనివ‌ర్సిటీల‌కు వీసీలు లేకున్నా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఒక్క‌మారు కూడా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌లేద‌ని అన్నారు.

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములు నాయ‌క్ మొద‌టి నుంచి తెలంగాణ ఉద్య‌మంలో ఉన్న వ్య‌క్తని,  తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి కోట్లాడిన వ్య‌క్తే రాష్ట్రానికి అన్యాయం జ‌రిగితే ప్రశ్నిస్తార‌ని అన్నారు.రాములు నాయ‌క్‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసి గెలిపించాలని కోరారు.రాష్ట్రంలో 31వేల ఉద్యోగాలు ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ ద్వారా  ల‌క్షా ముప్పై వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన‌ట్లు మాయ‌మాట‌లతో టీఆర్ఎస్ ప్రభుత్వం  ప్ర‌జ‌ల‌ను మభ్య పెడుతోందని అన్నారు.  1.93 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీల ఉన్న వాటిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం విడ్డూర‌మ‌న్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులను,యువ‌త‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారని వారు అన్నారు.  ఈ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిస్తే 33 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన‌ట్లేన‌ని స్ప‌ష్టం చేశారు. యువ‌త‌కు ఉద్యోగాలు రావాల‌ంటే సమస్యలపై ప్ర‌శ్నించే గొంతును మండ‌లికి పంపాల‌న్నారు. మన సమస్యలు నెరవేరాలంటే కాంగ్రెస్ అభ్య‌ర్థి రాముల నాయ‌క్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు, ఎస్.కె. బిక్కన్, సాబ్,Md.అజ్మతుల్లా,సత్తార్,చక్రాల నాగేశ్వర్, లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పై హైకోర్టులో పిటిషన్

Murali Krishna

అభివృద్ది, ఆత్మగౌరవమే  గెలిచింది

Murali Krishna

కోలాహలంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్!!

Satyam NEWS

Leave a Comment