30.7 C
Hyderabad
April 29, 2024 05: 56 AM
Slider ముఖ్యంశాలు

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పై హైకోర్టులో పిటిషన్

#highcourt

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పై తెలంగాణ ప్రభుత్వం సిట్ చే విచారణ చేపడతారని చెప్పగా సిట్ చేత కాకుండా సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్, మరో ఇద్దరు తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది జి, కరుణాకర్ రెడ్డి మరియు నర్సింగ్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం మరోపక్క పేపర్ లీకేజీ చేయడం ఇది ఒక సాంప్రదాయంగా మారిందంటూ అంతేకాకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ సంవత్సరాల తరబడి లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల బారిన పడే పరిస్థితి ఏర్పడింది.  అంతేకాకుండా ఇలా పేపర్లు లికేజీ వలన నిరుద్యోగులు నమ్మకాన్ని కోల్పోతున్నారని మరియు పెద్ద ఎత్తున అనుమానానికి దారితీస్తుంది పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాలయాపన నోటిఫికేషన్లు తోటి నిరుద్యోగులను మభ్యపెట్టి కాలయాపన చేస్తుందని కాలయాపన కోసమే సిట్ ఎంక్వైరీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిందని దీనిపై సిట్ కు విచారణ చేసే సామర్థ్యం తక్కువ ఉన్నయని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే సంస్థ కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుసైగల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి.  కనుక కేంద్ర స్వతంత్ర సమస్త అయినా సిబిఐ చే ఎంక్వయిరీ చేసి దీనికి కారకులైన దోషులను శిక్షించాలని అది కేవలం సిబిఐ తో మాత్రమే సాధ్యపడుతుంది అంటూ న్యాయవాదులు అన్నారు.

Related posts

పులి చర్మం వ్యాపారం చేసే అంతర్రాష్ట్ర ముఠా పట్టుకున్న ములుగు పోలీసులు

Satyam NEWS

మెడికల్ నెగ్లిజెన్స్: పిల్లోడి పట్ల నీలోఫర్ వైద్యుల నిర్లక్ష్యం

Satyam NEWS

షాక్: కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ పేలుడు

Satyam NEWS

Leave a Comment