38.2 C
Hyderabad
May 5, 2024 22: 27 PM
Slider ముఖ్యంశాలు

అభివృద్ది, ఆత్మగౌరవమే  గెలిచింది

#ktr

మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం, కే‌సి‌ఆర్ అభివృద్దే గెలిచిందని టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కే‌టి‌ఆర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితం అనంతరం ఆయన మాట్లాడుతూ  నల్గొండ జిల్లాలో జరిగిన 3 ఉప ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ ను గెలిపించారన్నారు. బలవంతపు ఉప ఎన్నికకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మునుగోడు ప్రజల చైతన్యం ముందు మోడి, అమిత్ షా లకు బుద్ది చెప్పారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవింకాకుండా 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చి తెలంగాణ లో కూడా ఎం‌ఎల్‌ఏ లను ప్రలోభ పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని మునుగోడు ఓటర్లు తిప్పికొట్టారన్నారు.  

డబ్బులతో ఎన్నికలతో గెలిచే ప్రయత్నం తెలంగాణ ఆత్మగౌరవం ముందు వెలవెలపోయిందన్నారు. బి‌జే‌పి నేతలు అనేక మంది డబ్బులతో దొరికారన్నారు. వివేక్ 75 కోట్ల రూపాయలు ఖాతాలు మళ్లించరన్నారు. ఈటెల రాజేందర్, వివేక్ లు కోట్లాది రూపాయలు హవాలా మార్గం ద్వారా మారుతున్నాయన్నారు. అన్నీ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఐనా వారు పట్టించుకోకవటం బాధాకరమన్నారు. డబ్బు మయమైన ఎన్నికలకు బి‌జే‌పి కారణమన్నారు. తాము దారితప్పితే 40 ఐ‌టి టీంలు అడ్డుకునేవన్నారు.  టి‌ఆర్‌ఎస్ విజయంలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర అన్నారు. తాము ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఓటమి చెందిన తర్వాత మరిన్ని ఆరోపణలు చేసేవారికి కోలుకోకుండా గుణపాఠం చెప్పాలన్నారు. తాము కూడా దుబ్బాక, హుజూరాబాద్ లలో ఒడితే హుందాగా స్వీకరించమన్నారు. కానీ మునుగోడు లో వొడిపోగానే విమర్శలు చేయటం దారుణం.

గత ఎన్నికల కంటే 23వేల వోట్లు తమకు ఎక్కువ వచ్చాయన్నారు. ఆనాడు 34 శాతం వోట్లు వస్తే ఇప్పుడు 43 శాతం వోట్లు వచ్చాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మెజారిటీ తగ్గింది కానీ, గెలుపును ఆపలేకపోయారు. కారును పోలిన గుర్తులకు 6వేల వోట్లు వచ్చినా తమకు ప్రజల మద్దతును తప్పించలేకపోయారు. కే‌సి‌ఆర్ నేతృత్వంలో తెలంగాణ లో జరిగిన అభివృద్దిని దేశానికి పరిచయం చేస్తామన్నారు. పలివెల గ్రామంలో టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌సిని, జెడ్‌పి ఛైర్మన్ పై ఈటెల నేతృత్వంలో దాడులు చేశారన్నారు. అబద్దాల బండి సంజయ్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా మునుగోడు ప్రజలు తమవైపే వున్నారన్నారు.

Related posts

కాటేదాన్ పారిశ్రామిక వాడలో చిరుత పులి

Satyam NEWS

కరోనా అదుపునకు ఎంపీ ఆదాల ఆర్థిక సాయం

Satyam NEWS

ఖమ్మంలో బంగారం వ్యాపారి నిలువు దోపిడి

Satyam NEWS

Leave a Comment