33.2 C
Hyderabad
May 11, 2024 14: 55 PM
Slider ప్రత్యేకం

ఎన్నికల కోడ్ అంటే ఇది

#By-elections

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఈ కోడ్‌ అమలులో ఉండగా రాజకీయ పార్టీలు ఏం చేయకూడదో చూద్దాం.

ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికార పార్టీ నేతలను కానీ, మంత్రులను కానీ వారి ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలవకూడదు.

ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కానీ, పార్టీ నేత కానీ తమ ఇంటి వద్ద కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే, తమ సొంత ఖర్చుతో మాత్రం చేసుకోవచ్చు.

ఏదైనా పథకం కానీ, ప్రాజెక్టుకు కానీ కోడ్ అమల్లోకి రావడానికి ముందే గ్రీన్ సిగ్నల్ లభించి, క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కాకపోతే, కోడ్ అమల్లోకి వచ్చాక ఆ పని ప్రారంభించడానికి వీల్లేదు.

అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు.

ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకూడదు.

కోడ్ అమల్లోకి వచ్చాక పెన్షన్ ఫాంలు స్వీకరించడం, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, బీపీఎల్ కుటుంబాలు ఎల్లో కార్డులు జారీ చేయడం నిషేధం.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు.

టెండర్లు జారీ చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ ప్రభుత్వం చేయకూడదు.

కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు ప్రారంభించడం, పెద్ద భవనాలకు క్లియరెన్స్ ఇవ్వడం నిషేధం.

మంత్రులు కూడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు. వారు ప్రభుత్వ సౌకర్యాలు ఉపయోగించరాదు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది.

Related posts

అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

కోర్టులో లొంగిపోయేందుకు ట్రంప్ సిద్ధం

Satyam NEWS

74 లక్షల ఖాతాలకు రూ.1500 నగదు బదిలీ రేపు

Satyam NEWS

Leave a Comment