26.7 C
Hyderabad
May 3, 2024 07: 41 AM
Slider ప్రత్యేకం

మిగిలిన డిగ్రీ సీట్లు

#admissions

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలాయి. సగానికి సగం కూడా భర్తీ కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం 3,46,777 సీట్లకు 2,04,299 భర్తీ కాలేదు. డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన కౌన్సిలింగ్‌ ముగిసింది. మూడు దశల్లో జరిగిన ఈ కౌన్సిలింగ్‌లో 1,42,478 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తొలిదశలో 84,549 సీట్లు, ద్వితీయ దశలో 38,645 సీట్లు, తుదిదశలో 18,284 సీట్లలోనే విద్యార్థులు ప్రవేశాలు పొందారు.ప్రభుత్వ కళాశాలల్లో 57,061 సీట్లు ఉండగా 26,227 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, ప్రైవేట్‌ ఎయిడెడ్‌లో 23,939 సీట్లకు7276, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌లో 2,62,970 సీట్లకు 1,06,650 విద్యార్థులు చేరారు. విశ్వవిద్యాలయాల కళాశాలల్లో 2,807 సీట్లు ఉండగా 1,325 భర్తీ అయ్యాయి. డిగ్రీలో మొత్తం 22 కోర్సులు ఉండగా 3 కోర్సుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అత్యధికంగా బిఎస్సీలో 62,429 మంది అడ్మిషన్లు పొందారు. బికాంలో 51,395 మంది, బిఎలో 11,914 మంది, బిబిఎలో 5,585 మంది అడ్మిషన్లు పొందారు.

Related posts

కొనకమిట్లలో ఘోర ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS

స్టాలిన్ తో మమత భేటీ

Murali Krishna

కాంగ్రెస్ పార్టీ మాదిగలు సీట్లు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment