30.7 C
Hyderabad
May 5, 2024 04: 29 AM
Slider రంగారెడ్డి

ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్ లో ఉద్యోగావకాశాలు

ఈ రోజు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సిబిఐటి) కళాశాలలోని ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగం ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్ లో ఉద్యోగావకాశాలు మీద ఒకరోజు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంనికి హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ) కోకుంట్ల మదన్ మోహన్ ముఖ్య అతిధి గా విచ్చేసారు.

ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ డిజైన్ అనేది వివిధ లైటింగ్ పరికరాలు, విద్యుత్ వ్యవస్థ మరియు ప్రవాహం , భద్రతా వ్యవస్థ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మరియు వాయిస్ మరియు డేటా కమ్యూనికేషన్స్ , ఎలక్ట్రికల్ పరికరాల అభివృద్ధి మరియు ఇన్‌స్టాలేషన్‌ను ప్లాన్ చేయడం, రూపొందించడం, పరీక్షించడం మరియు పర్యవేక్షించడం. ఇది భవనం అలాగే ఫ్యాక్టరీ నిర్మాణం లో అత్యంత కీలకమైన మరియు ముఖ్యమైనది.

ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్ అనేది అధునాతన విద్యుత్ భావనలు, నియంత్రణ వ్యవస్థలు మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్ యొక్క మూల్యాంకనానికి రూపకల్పన సాధనం. మొత్తం అనుకరణ వ్యవస్థ అత్యంత ఇంటరాక్టివ్‌గా మరియు అనువైనదిగా, ఇంజనీరింగ్ అభివృద్ధికి అనుగుణంగా రూపొందించాలి. ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్ రూపకల్పనలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్ శిక్షణ లో అనేక ఉద్యోగావకాశాలు వున్నాయి.

ఈ కార్యక్రమం లో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగ అధిపతి ప్రొఫెసర్ జి సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సంతోష్ కుమార్, పి హేమేశ్వర్ చారి , ఇతర అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అధికార వైసీపీకి దివంగత మహానేత రోశయ్యపై ఎందుకంత ప్రేమ?

Satyam NEWS

మొక్కల సంరక్షణ మనందరం బాధ్యతగా స్వీకరించాలి

Satyam NEWS

కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఇద్దరే

Satyam NEWS

Leave a Comment