28.7 C
Hyderabad
May 6, 2024 00: 38 AM
Slider సంపాదకీయం

అధికార వైసీపీకి దివంగత మహానేత రోశయ్యపై ఎందుకంత ప్రేమ?

#rosaiah

రాజకీయ భీష్మాచార్యులు, ఆర్యవైశ్యుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత మహానేత,  కొణిజేటి రోశయ్య పై అధికార వైకాపాకు హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. గత నాలుగేళ్లుగా ఆ మహనీయుడు రోశయ్య వూసే పట్టించుకోని అధికార వైసీపీకి అవ్యాజ ప్రేమ కలగడానికి రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు వున్న ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓట్లకు గాలం వేయడానికే అనే చర్చ సర్వత్రా కొనసాగుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి మరణానంతరం తాను సీఎం కావాలని జగన్ రెడ్డి విఫల యత్నం చేశాడు. ఆయన ఆశలను అడియాశలు చేస్తూ రోశయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎం గా నియామకం చేసింది. దీన్ని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి, ఆయన తాబేదార్లు రోశయ్య సీఎంగా వున్నంతకాలం  ఏమాత్రం సహకరించకుండా నరకం చూపిన విషయం వైశ్య సామాజిక వర్గం మర్చిపోలేదు. చివరకు రోశయ్యను సీఎం పదవి నుంచి దిగిపోయే వరకు జగన్ రెడ్డి నిద్ర పట్ట లేదు.

రోశయ్యకు పదవి లేకుండా చేయాలని జగన్ రెడ్డి చేయాలని విఫల యత్నం చేసిన విషయం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలియంది కాదు. జగన్ రెడ్డికి షాక్ ఇస్తూ రోశయ్య సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమిళనాడు గవర్నర్ గా  నియామకం చేసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అన్ని విధాల అండదండలుగా నిలిచిన రోశయ్య మరణానంతరం కనీసం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడం, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. 

అనేక మంది సాధారణ వ్యక్తుల అంత్య క్రియలకు హాజరైన జగన్ రెడ్డి.. మాజీ సీఎం రోశయ్య పట్ల అంత దారుణంగా వ్యవహరించడం ఆర్యవైశ్య సామాజిక వర్గం తీవ్ర మనస్తానికి గురైన విషయం విదితమే. గత నాలుగేళ్లలో ఆర్యవైశ్య సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులు.. రాజకీయంగా జగన్ రెడ్డి చూపుతున్న వివక్షపై అంతర్లీనంగా తీవ్ర అసంతృప్తితో వుంది.

అంతే కాకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ ను తొలగించడం, ఉత్తరాంద్రలో బలమైన నాయకుడిగా వున్న కోలగట్ల వీరద్రస్వామికి ప్రాధాన్యత లేని డిప్యూటీ స్పీకర్ పదవి నివ్వడం.. కాపు కార్పొరేషన్ లాంటి వాటికి వందలాది కోట్లు కేటాయించిన ప్రభుత్వం వైశ్యు కార్పోరేషన్ కు గత నాలుగేళ్లలో ఒక్క రూపాయి నిధులు కేటాయించక పోగా.. ఇప్పటి వరకు డైరెక్టర్లను నియమించక పోవడం.. శాసన మండలితో మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడం తో పాటు రాజకీయంగా కీలక పదవులు లేకపోవడం పట్ల ఆర్యవైశ్య సామాజిక వర్గం అధికార వైకాపా పై తీవ్ర వ్యతిరేకతతో వున్నారు.

వీటన్నిటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డిని ఎలాగైనా గద్దె దింపాలనే ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎదురు చూస్తోంది. సుమారు 100 నియోజక వర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములు నిర్ణయించే బలమైన ఓటు బ్యాంకు గల ఆర్యవైశ్య సామాజిక వర్గం తమకు వ్యతిరేకంగా వుందన్న విషయాన్ని ఐ – ప్యాక్ సర్వే ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ రెడ్డి వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా రోశయ్య వూసే పట్టించుకోని  సీఎం జగన్ రెడ్డి తన పార్టీకి తాబేదారులుగా వ్యవహరిస్తున్న వున్న ఆర్యవైశ్య మహాసభ నేతలను రంగంలోకి దింపారు. మంగళవారం రోశయ్య 90వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రోశయ్యకు అధికార వైకాపా తరఫున ఆర్యవైశ్య మహాసభ నేతలు, వైకాపా ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులతో నివాళులు అర్పించడం.. అక్కడక్కడా విగ్రహాలు అవిష్కరించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది.

అయితే సీఎం జగన్ రెడ్డి మాత్రం రోశయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఘటన లేకపోవడం విచారకరం. ఎందరో నేతల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరైన సీఎం జగన్ రెడ్డి తమ సామాజిక వర్గానికి లెజెండ్ అయిన రోశయ్య పట్ల చూపుతున్న వివక్షతను ఆర్యవైశ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Related posts

గవర్నర్ వ్యవస్థ పరువు తీస్తున్న తమిళసై

Satyam NEWS

విజయనగరం ధ్యానమందిరం లో స్వామీజీ మహా సమాధి ఆరాధనోత్సం

Satyam NEWS

‘సింహవాహిని దర్శనం-సకల పాప సంహారం’

Satyam NEWS

Leave a Comment