41.2 C
Hyderabad
May 4, 2024 16: 50 PM
Slider వరంగల్

బంధాలను కొనసాగించలేని వారే అనాథలు

#taslima

ఎవరు లేనివారు అనాథలు కాదని, అందరు ఉండి కూడా బంధాలను కొనసాగించలేని వారే అనాధలని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. సోమవారం లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ( వర్డ్ సంస్థ ) ఉమెన్ ఓరియంటల్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తస్లీమా వృద్ధులకు అందించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ సృష్టిలో మానవ జీవితం గొప్పదని, బంధాలు బంధుత్వాలు దొరకడం మన అదృష్టమని అలాంటి బంధాలను దూరం చేసి అనాథలుగా మార్చ వద్దని తస్లీమా అన్నారు. ఎవరు లేకున్నా అనాథలుగా భావించవద్దని సమాజమే మనకు ఆత్మీయులుగా భావిస్తూ జీవించాలని తస్లీమా తెలిపారు.

సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని సంస్థ వారిని తస్లీమా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సిస్టర్ మేరీ జార్జి, సుపీరియర్ రీజి చాకో, ప్రిన్సిపాల్ జ్యోతి,సోలి, మాధవి, జూలీ, శైనీ వృద్ధులు తదితరులు ఉన్నారు.

Related posts

గంటస్థంభం సాక్షిగా 60 వాహనాలపై కేసులు..

Satyam NEWS

కాటేదాన్ పారిశ్రామిక వాడలో చిరుత పులి

Satyam NEWS

25 మందితో టిటిడి పాలకమండలి ఖరారు

Satyam NEWS

Leave a Comment