29.7 C
Hyderabad
May 4, 2024 06: 13 AM
Slider తెలంగాణ

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల

etala rajendar

కరోనా వైరస్ తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోషల్ మీడియాలో చైనా కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కరోనా వైరస్ సోకితే ఇక చావే శరణ్యం అన్నట్లుగా ప్రచారం జరిగిందని దాంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు.

ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో భరోసా కలగనిదే వారిలో ఆందోళనలు తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు. అందుకనే కరోనా వైరస్ పట్ల ఒక పక్క వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటునే మరోపక్క కరోనా వైరస్ సోకితే అందించాల్సిన చికిత్స పట్ల తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కెసిఆర్ సలహాలు, సూచనలతో పూర్తిస్థాయిలో చేయగలిగామని ఈటల అన్నారు.

ఈ క్రమంలో ప్రతిరోజు పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు. 24 గంటలు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి సిబ్బంది వరకు పని చేశారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీడియా కూడా సంయమనంతో ప్రజలను చైతన్య పరిచేందుకు వార్తలు ప్రచురించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 అయితే ఇంత చెప్తున్నా మాస్కుల కోసం ప్రజలు పడుతున్న అతృత, కరుణ వైరస్ పై సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం తో ఇంకా ప్రజల్లో ఆందోళన ఉంది.. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ గా నమోదైన 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరకు మంత్రి స్వయంగా వెళ్లారు. ఆయనతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ఎట్టి పరిస్థితిలో భయపడవద్దని ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందించి పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటికి తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను, భయాలను తొలగించడానికి గాంధీలో పర్యటిస్తున్నట్లు ఈటల తెలిపారు. పాజిటివ్ వ్యక్తి తో పాటు కరోనా వైరుస్ అనుమానం తో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చి వార్డులో ఉన్న వారితో కూడా మంత్రి స్వయంగా మాట్లాడారు.

గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఏర్పాట్లపై చర్చించారు. కరోనా వైరస్ పేషెంట్ల వద్ద ఉన్నప్పుడు మాత్రమే మంత్రి మాస్కులు ధరించి వెళ్లారు. హాస్పిటల్ లో పలువురు పేషెంట్ నేరుగా కలుసుకొని ట్రీట్మెంట్ పొందుతున్న విధానంపై చర్చించారు. అక్కడ ఎక్కడ కూడా మాస్కులు ధరించి కుండా పేషెంట్ల తో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తుల డ్రాప్ లెట్స్ ద్వారా మాత్రమే మరొకరికి వైరస్ సోకుతుంది తప్ప గాంధీ హాస్పిటల్ లో ఉన్న అందరికీ వైరస్ వల్ల ప్రమాదం ఉండే అవకాశమే లేదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. వేరు వేరు వార్డులో ఉన్న పేషంట్ ని అడిగి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రి లో ఉన్న 7 ఫ్లోర్ లు కలియతిరిగారు. ఆయన వెంట డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ డాక్టర్ రమేష్ రెడ్డి , డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారు.

Related posts

ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన భూ బాధితులు

Satyam NEWS

రోడ్లపై స్ట్రాం వాటర్ నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

విద్యుత్ శాఖ అధికారులపై వైయస్సార్సీపి నాయకుడి దాడి

Satyam NEWS

Leave a Comment