28.7 C
Hyderabad
April 28, 2024 08: 43 AM
Slider నిజామాబాద్

ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన భూ బాధితులు

bichkunda rdo

బిచ్కుంద మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో భూ బాధితులతో బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్ నిర్వహించిన సమావేశంలో జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, ఇల్లు కోల్పోతున్న భూ బాధితులు శుక్రవారం ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు. భూములు కోల్పోతున్న తమకు మార్కెట్ ధర కన్నా తక్కువ డబ్బులు చెల్లిస్తున్నారని దీంతో భూ బాధితులు పూర్తిగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఫథలాపూర్ గ్రామానికి ఆనుకొని ఉన్న ప్లాట్లకు మామూలు వ్యవసాయ భూమి కింద డబ్బులు చెల్లిస్తున్నారని దీంతో ఇల్లు ప్లాట్లు కొనలేక తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న తమకు పూర్తి నష్టపరిహారం అందే విధంగా చూడాలని వినతి పత్రంలో కోరడం జరిగిందని ఫథలాపూర్, రాజుల, కందర్ పల్లి భూ బాధితులు తెలిపారు.

అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో ఇండ్లు భూములు కోల్పోతున్న బాధితులకు పూర్తి పరిహారం అంది విధంగా  కృషి చేస్తామని ఎవరైనా తమ భూములు, ప్లాట్లు, ఇండ్లు కానీ తప్పి పోయినట్లైతే దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మునీరుద్దీన్ ఫథలాపూర్ సర్పంచ్ అరుణ్, నాయకులు యాదు భూ బాధితులు ఉన్నారు.

Related posts

కలెక్టర్ కు వి ఆర్ ఓ పై గ్రామస్తుల ఫిర్యాదు

Bhavani

యుద్ధ ప్రాతిపదికన అంబర్పేట్ లో అభివృద్ధి పనులు

Satyam NEWS

శ్రీకాకుళం సన్యాసిరావును సత్కరించిన ప్రెస్ అకాడమీ సెక్రటరీ

Bhavani

Leave a Comment