28.7 C
Hyderabad
May 6, 2024 00: 24 AM
Slider వరంగల్

పుట్టిన ఊరికి సేవ చేయడం అదృష్టం

#taslima

నిరుపేద ప్రజల  జీవితాలలో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో  జీవితం త్యాగం చేసిన స్వర్గీయ,యం.డి సర్వర్ జీవితం అందరికీ ఆధర్శనియమని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ఉద్యమాల పోరాట యోధుడు యం.డి సర్వర్ 36వ వర్ధంతి సందర్భంగా శనివారం ములుగు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఆయన స్మారకస్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,

అణగారిన వర్గాల పీడిత ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన కామ్రేడ్ సర్వర్ 36వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మరియు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్వర్ జ్ఞాపకార్ధంగా కైలాస (స్వర్గ) రథం రామచంద్రాపురం గ్రామానికి (గ్రామ పంచాయితీకి) అందజేశారు. పేద రైతుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం కృషి చేసి, పేదరికం నిర్మూలన,సమానత్వం కోసం ప్రాణ త్యాగం చేసిన సర్వర్ జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని, పుట్టిన ఊరి కోసం సేవ చేయడం అదృష్టమని, ఈ ప్రాంతం కోసం ఎంత చేసిన తక్కువేనని, మా గ్రామం రుణం తీర్చుకోలేనిదని తస్లీమా అన్నారు.

అనంతరం గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీకి కైలాస (స్వర్గ) రథం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హట్కర్ కల్పన రూప్సింగ్, ఎంపిటిసి భూక్యా అమృత భాయ్, ఉప సర్పంచ్ వేములపల్లి అశోక్,గ్రామ కార్యదర్శి కోటేశ్వర్, గ్రామ పెద్దలు దొంతి రాంరెడ్డి, దొంతి ప్రతాప్ రెడ్డి,రాజమౌళి, బేతి రాజిరెడ్డి,గుజ్జుల లక్ష్మారెడ్డి, ఎం. సి.పి.ఐ.యు జిల్లా నాయకులు,కుటుంబ సభ్యులు,సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

వై ఎస్ జగన్ రాజకీయ వలలో చిక్కుకున్న వకీల్ సాబ్

Satyam NEWS

జాతీయ స్థాయి పేద క్రీడాకారిణికి ఆర్థిక సహాయం

Satyam NEWS

పంజాబ్ లో కాంగ్రెస్ పరువు మిగిలేనా?

Satyam NEWS

Leave a Comment