27.7 C
Hyderabad
May 4, 2024 07: 09 AM
Slider వరంగల్

పల్లె ప్రగతి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

#palle pragati

దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.

ములుగు జిల్లా లోని జగ్గనాపేట, మదన పల్లి గ్రామాలలో పల్లె ప్రగతి రెండవ రోజు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పల్లె ప్రగతి లో పాల్గొని ఆమె కొన్ని ప్రాంతాలను శుభ్రం చేశారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అని ఆమె గుర్తు చేశారు.

పల్లెలు ప్రగతికి మెట్టు అని భావించిన తెరాస ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం తీసుకురావడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. తను కూడా పల్లె ప్రగతి లో పాల్గొనడం  సంతోషం గా ఉందని తెలిపారు. అందరు మొక్కలను నాటిన తర్వాత వాటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పొరిక విజయ్ రాం, గట్టు మహేందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు సారయ్య, రఘువరన్, ఆశ వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

టీడీపీ ముస్లీం నేతలు వైసీపీ ముస్లీం నేతలకు సవాల్

Satyam NEWS

విశాఖ లో వన మహోత్సవ కార్యక్రమం

Bhavani

పదవి తిరస్కరించిన హర్షకుమార్

Bhavani

Leave a Comment