30.7 C
Hyderabad
April 29, 2024 03: 21 AM
Slider కడప

టీడీపీ ముస్లీం నేతలు వైసీపీ ముస్లీం నేతలకు సవాల్

#muslims

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ముస్లిం మైనార్టీలు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నిన్నటి రోజున స్థానిక స్థానికేతర వైసీపీ మైనార్టీ నాయకులు చేసిన చౌకబారు ప్రకటనలను దీటుగా ఖండించారు.

ఈ సమావేశానికి టీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం మైనార్టీ నాయకులు,పట్టణ ప్రధాన కార్యదర్శి మండెం అబూబకర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ పర్వదినాన స్థానిక పెద్ద ఈద్గా నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పత్రికా ప్రకటన విడుదల చేశారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరించడం జరిగిందని, అలాగే తెలుగుదేశం పార్టీ హయంలో రాజంపేట పట్టణ ముస్లింలకు ఈద్గా కోసం ఐదు ఎకరాల స్థలాన్ని 25 లక్షల రూపాయలు వ్యయంతో కాంపౌండ్ వాల్ ని నిర్మించి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తుచేశారని తెలిపారు.దీన్ని అధికార పార్టీకి చెందిన కొందరు మైనార్టీ నేతలు వివాదం చేస్తూ బత్యాల పై ఆరోపణలు చేయడం  హాస్యాస్పదం అన్నారు.

భత్యాల ప్రతికా ప్రకటనను పూర్తిగా చదవకుండా,అసత్య ఆరోపణలు చేయడం వారి అజ్ఞానంకు నిదర్శనం అన్నారు.అలాగే బత్యాల ని విమర్శిస్తూ ఊరు పేరు లేని వ్యక్తిని విమర్శించారని, బత్యాలకి ఊరుంది పేరు ఉంది, రాజంపేటలో ఓటు హక్కు ఉంది, ఇల్లు ఉంది సమయం చూసుకొని మీరు వస్తే అన్ని చూపిస్తామని వెల్లడించారు.దేశ పౌరుడు దేశంలోని ఏ ప్రాంతంలో నుంచైనా పోటీ చేసే హక్కును రాజ్యాంగం కల్పించిన విషయం పై మీరు అవగాహన కూడా లేకుండా మాట్లాడటం మీ అజ్ఞా నమని స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.

అలాగైతే దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తల్లి గారైన విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.ముస్లింల అభివృద్ధి బాగా జరిగిందంటున్న మీకు రాజంపేట తెలుగుదేశం పార్టీ మైనార్టీలు తరఫున కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.

నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయ పథకం లక్ష రూపాయలు మీ ప్రభుత్వంలో ఎంతమందికి యువతులకు ఇచ్చారు..?

నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీ ప్రభుత్వంలో ఎంతమందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు..?

ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా మీ ప్రభుత్వంలో ఎంతమంది ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యను అందించారు..?

ఇస్లామిక్ బ్యాంక్ స్థాపన ద్వారా 5 లక్షల రూపాయలు వడ్డీరహిత రుణాలను మీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారు..?

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలు కడుపునిండా తిని సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో రంజాన్ తోఫా ద్వారా నిత్యవసర వస్తువులు మీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారు..?

మక్కా యాత్రికల కోసం ప్రతిష్టాత్మకంగా 13 ఎకరాల విస్తీర్ణంలో 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పవిత్ర హజ్ హౌస్ ను మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పూర్తయిన కేవలం రాజకీయ కక్షతో వినియోగంలోని తీసుకురాకుండా అసాంఘిక కార్యకలాపాలకు, సంఘవిద్రోక శక్తులకు అడ్డాగా మార్చింది ఎవరు..? అంటూ ప్రశ్నల సంధించారు.

మిగిలిన ఒక్క సంత్సరంలో నైనా ముఖ్యమంత్రి జగన్ గారు ముస్లిం సామాజిక వర్గానికి చేసిన వాగ్దానాలను అమలు చేయించే దిశగా ప్రయత్నించాలని అధికారి పార్టీ ముస్లిం నేతలకు హితువు పలికారు.మైనార్టీల అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు మేము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

ఈ సమావేశంలో రాజంపేట పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు మన్నూరు పీరు సాహెబ్, ప్రధాన కార్యదర్శి S.K. కరీమ్, మండల ప్రధాన కార్యదర్శి చెప్పలి.కేశవ, మైనార్టీ విభాగం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మాబాషా, మండెం కరిముల్లా, కార్యదర్శి కార్యదర్శి గౌస్ బేగ్, బూత్ కన్వీనర్ పటాన్ అష్రఫ్, మైనార్టీ నాయకులు షామీర్ భాష, దగ్గుటూరి హుస్సేన్, రసూల్, షేక్ బాషా, సైయద్ మౌలాలి, షేక్ మస్తాన్, మస్తాన్ ఖాన్, షేక్ అలీం, షేక్ నాజిర్ ఇంకా ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, సీనియర్ బిసి నాయకులు ఇడిమడకల కుమార్, తెలుగుయువత అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అనమలగుండం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దిశ తల్లిదండ్రులపై టిఆర్ఎస్ నాయకురాలి దారుణ వ్యాఖ్యలు

Satyam NEWS

హెచ్ పి గ్యాస్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

Satyam NEWS

సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment