Slider తెలంగాణ

ఇనీషియేటీవ్: పట్టణ ఓటర్లు అందరూ ఓటేయాలి

nagireddy

మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ఎన్నికల తో పోల్చితే పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయించే టప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. బ్యాలెట్ పేపర్ ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగా చూడాలని,  పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితా తయారు చేయని మునిసిపల్ కమిషనర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్క ఓటర్ వద్ద తప్పనిసరిగా కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డులలో ఎదో ఒక గుర్తింపు కార్డును చూసిన తర్వాతే ఓటింగ్ కు  అనుమతించాలని నాగిరెడ్డి కోరారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, సంచాలకులు శ్రీదేవి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

బెల్టు షాపులపై మల్కాజ్ గిరి ఎస్ఓటి పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS

త్వరలోనే నూతన నాలా నిర్మాణాన్ని చేపడతాం

Satyam NEWS

దేవాడలో దళితులపై అగ్రవర్ణాల దాడి

Satyam NEWS

Leave a Comment