31.2 C
Hyderabad
May 12, 2024 00: 33 AM
Slider నల్గొండ

ఇంటి ఇంటిలో నరేంద్ర మోడీ ఫొటో పెట్టుకునే స్థితి వచ్చింది

#hujurnagarbjp

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోది,అమిత్ షా,బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా రూపు దిద్దుకుంటుందని అన్నారు.

గ్రామాలలో ఇంటింటా ప్రధాని నరేంద్ర మోది ఫోటో పెట్టుకునే పరిస్థితి మన హూజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా వచ్చిందని, వచ్చే నెల సెప్టెంబర్ నెలలో 302 బూత్ లకు గాను ప్రతి బూత్ నుండి 15 మందిని క్రియాశీల కార్యకర్తలతో 4,530 మందితో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్, విజయశాంతి,దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు తో భారి బహిరంగ సభా ఉంటుందని,హూజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త,నాయకులు,అభిమానులు హాజరు కావలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బహిరంగ సభ తేది,స్థలం త్వరలో తెలియజేస్తామని అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖలకు శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ 50 లక్షల రూపాయలతో ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన రేవంత్ రెడ్డి అని విమర్శించారు.మునుగోడు నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్నారు.

హూజూర్ నగర్ నియోజకవర్గంలో 100 కోట్ల హామీలు ఏమైనాయని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.శాసనసభ్యుడు సైదిరెడ్డి విలేకరులపై దాడులు మానుకొని వారిని గౌరవించాలని అన్నారు.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే హూజూర్ నగర్ ను ‘పోంచర్ల’ గా మారుస్తానన్న తన మాటకు కట్టుబడి ఉన్ననని అన్నారు.

ఈ కార్యక్రమంలో వేముల శేఖర్ రెడ్డి, కొణతం లచ్చిరెడ్డి,అన్నేపంగు అబ్బాస్, ముసుకుల చంద్రారెడ్డి,అందే కోటయ్య, దుండిగల యల్లయ్య,కుందూరు కోటిరెడ్డి, పోనగండ్ల సత్యనారాయణ రెడ్డి,యర్రం శంభిరెడ్డి,కొత్తపల్లి శ్రీనివాస్,మందా వెంకటేశ్వర్లు,చిత్తలూరి సోమయ్య, చింతలపూడి ఉమామహేశ్వరావు,కొత్తూరి వెంకటేశ్వర్లు,జేనిగల శ్రీనివాస్,గండు శ్రీను, గంధం సతీష్,వలపుదాస్ గోపి,ముసంగి శ్రీను,కుక్కడపు వెంకటేశ్వర్లు,ఊట్ల నాగేశ్వరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు పార్కులు

Satyam NEWS

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన విదేశాంగ మంత్రి

Satyam NEWS

పల్నాడు జిల్లా ఏర్పాటు పనులపై ఎంఎల్ ఏ డాక్టర్ గోపిరెడ్డి సమీక్ష

Satyam NEWS

Leave a Comment