40.2 C
Hyderabad
April 29, 2024 15: 32 PM
Slider హైదరాబాద్

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు పార్కులు

#madhavaram

ఒకప్పటి హైదరాబాద్‌ వేరు.. ప్రస్తుత హైదరాబాద్‌ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని కూకట్ పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గం లోని కే.పి.హెచ్.బి కాలనీ  డివిజన్ స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 43వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కె.పి.హెచ్.బి కాలనీలోని చిల్డ్రన్స్ పార్కులను, మహిళా పార్కులను ఏర్పాటు చేశామని డివిజన్ లో మంచినీటి సమస్య లేకుండా చేశామని అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని అందులో భాగంగానే కే.పి.హెచ్.బి డివిజన్ లో రోడ్లు డ్రైనేజీలు, మంచినీటి సమస్యతో పాటుగా మహిళల కోసం ప్రత్యేకమైన పార్కులను చిన్నపిల్లల కోసం చిల్డ్రన్స్ పార్కులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్న బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని అన్నారు.

సత్యం న్యూస్, హైదరాబాద్

Related posts

గంగిరెడ్డి కి వైసీపీ కి సంబంధం లేదా?

Satyam NEWS

నరసరావుపేటలో భారీ ఎత్తు రేషన్ బియ్యం స్మగ్లింగ్

Satyam NEWS

తిరుపతిలో ప్రమాదకర క్లీనికల్ వేస్ట్ ను తక్షణమే తొలగించాలి

Satyam NEWS

Leave a Comment