29.7 C
Hyderabad
May 3, 2024 04: 55 AM
Slider వరంగల్

తీజ్ ఉత్సవం: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

#teezfestival

సంస్కృతీ సాంప్రదాయాలు నాగరితకు గొప్ప పునాది అని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.

గురువారం ములుగు జిల్లా  గోవిందరావు పేట మండలం బాలాజీ నగర్ లో జరిగిన తీజ్ ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో మొలకెత్తిన నారు తలపై పెట్టుకొని వారితో కలిసి నృత్యం చేశారు.

అనంతరం తస్లీమా మాట్లాడుతూ భారత దేశం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, భిన్నత్వంలో ఏకత్వం మనందరిని కలిసి ఉండేలా చేస్తుందని అన్నారు.

మనిషి మారినా సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోలేదని, అందుకే మనమందరం కలిసి ఉంటున్నామని తస్లీమా తెలిపారు.

గిరిజనులు నియమ,నిష్ఠలతో ఉండి,ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తీజ్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని తస్లీమా అన్నారు. సర్పంచ్ వినోద్ నాయక్, ఎంపిటిసి పూర్ణ, ఉషా,రాజు, బాలు,గణేష్ లాల్,రాజు గ్రామస్థులు ఉన్నారు.

Related posts

యువత స్వయం కృషితో రాణించాలి

Satyam NEWS

చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎంజీఆర్

Satyam NEWS

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

Sub Editor

Leave a Comment