39.2 C
Hyderabad
May 3, 2024 11: 36 AM
Slider మహబూబ్ నగర్

ఎష్యూరెన్స్: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

niranjanreddy 1

దూర ప్రాంతాల్లో ఉండే బంధువులు కుటుంబ సభ్యుల గురించి ప్రజలు ఎవ్వరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలకు హమీ ఇచ్చారు. శనివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో పరిశుభ్రత అంశాలను పరిశీలించారు.

కరోనా వైరస్ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు.డ్రై నెజ్ కాలువలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. అనంతరం మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుంది ప్రజలు ఎవ్వరు ఇండ్ల నుండి బయటికి రాకూడదన్నారు.

కరోనా వైరస్  వ్యాధి నుండి  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి  పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి బయటకు రాకుండా  కరోనా వైరస్ మహమ్మారి నుండి జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రజలు దూరప్రయాణాలు చేయడం మంచిది కాదన్నారు.

ప్రయాణాలను ప్రభుత్వం నిషేధించిదన్నారు. అత్యవసర సమయంలో డయల్ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. అధికారులతో అనుమతులు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలీస్,వైద్య  అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి  రాకూడదాన్నారు.

కరోనా వైరస్ వ్యాధి మందు తయారుచేయడం 18 నెలల సమయం పడుతుందన్నారు. అంతవరకూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒకరిని ఒకరు కలవడం, చేతులు కలపడం, సందడిగా  ఉండకుండా జాగ్రత్తలు  పాటించాలన్నారు. మనం బ్రతకాలంటే కరోనా అంతమయ్యే వరకు స్వీయ నిర్బంధం పాటించాలన్నారు.

ప్రజలకు కరోనా  వైరస్ వ్యాధి పట్ల స్పష్టత వచ్చిందన్నారు. ఈ కరోనా వైరస్ వ్యాధి మానవాళి అనుభవంలోకి మొదటిసారి వచ్చిందన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. అతి ప్రమాదకరమైన వ్యాధి అన్నారు. మీడియా కరోనా వైరస్ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఉండాలన్నారు.

ఇంట్లో చిన్నారులకు బత్తాయి, దానిమ్మ,సపోటా వంటి పండ్లు తీసుకోవడం వ్యాధి నిరోధకశక్తిని ఇస్తుందని అన్నారు. అనంతరం రామాపురం రోడ్ లో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 70 పడలకలను  పరిశీలించారు.

 అంతకు ముందు ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. అధికారులకు సహకరించాలన్నారు. కరోనా వైరస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా  మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘు ప్రోలు విజయలక్ష్మి చంద్ర శేఖర చారి, వైస్ చైర్మన్  మహమ్మద బేగం ఖాదర్, డిసిసిబి డైరెక్టర్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి సింగిల్విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్  కాటం జంబులయ్య, కిషన్ నాయక్, మున్సిపల్ కమిషనర్  వెంకటయ్య,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆరుబయట నమాజ్ చేసి నిరసన తెలియజేసిన ముస్లిం సోదరులు

Satyam NEWS

వైసీపీ కి కష్ట కాలం: టీడీపీలో చేరడానికి క్యూ

Satyam NEWS

కార్మికుల పట్ల బిజెపి అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా సమ్మె

Satyam NEWS

Leave a Comment