33.2 C
Hyderabad
May 15, 2024 13: 51 PM
Slider ప్రత్యేకం

పోలింగ్ కు సర్వం సిద్దం

#munugod

మునుగొడులో 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీ చేపడుతున్నారు.  చండూరు లో ఇందుకు సంబందించి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బంది తమకు ఇచ్చిన సామగ్రిని తీసుకొని ప్రత్యేక బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్‌ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.  మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు  ఏర్పాటు చేశారు.  

నవంబర్‌ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు. ఐదు వేల మంది పోలీస్‌ సిబ్బందిని మోహరిస్తున్నారు.  199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది.  పోలింగ్‌ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.  ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి.  45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు.  వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

Related posts

ఒక్క సారి ఈ వీడియో చూడండి…గుండె కదిలిపోతుంది..

Satyam NEWS

విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

Satyam NEWS

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటే అరెస్టు చేస్తారా?

Bhavani

Leave a Comment