37.2 C
Hyderabad
April 26, 2024 20: 07 PM
Slider రంగారెడ్డి

ఒక్క సారి ఈ వీడియో చూడండి…గుండె కదిలిపోతుంది..

#road accident

ఈ వీడియో ఒక్క సారి చూడండి…. రోమాలు నిక్కబొడుచుకుంటాయి… ఒక్క క్షణం కోపం… మరుక్షణంలో బాధ కలుగుతాయి…

విలాసవంతమైన హోటల్ లో తాగి ఆడి కారులో వేగంగా వెళుతూ ఒకడు చేసిన యాక్సిడెంట్ కు ఇద్దరి ప్రాణాలు పోయాయి… కాదు కాదు… రెండు కుటుంబాలు జీవితాన్ని కోల్పోయాయి.

నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఇన్ ఆర్బిట్ మాల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఆడి కారు ఒక ఆటోను వెనుకనుంచి మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టింది.

దాంతో ఒక్క క్షణంలో ఆటో పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి ఆమడదూరంలో పడింది.

ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. ఆడి కారును నడుపుతున్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని పోలీసులు కేసు పెట్టారు.

దారుణమైన ఈ సంఘటన విలాసవంతమైన కార్లలో రెక్ లెస్ గా తిరిగే వారికి కనువిప్పు కావాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఈ ప్రమాద దృశ్యాలను ఒక చిన్న వీడియోగా చేసి ప్రజలకు అందిస్తున్నారు.

ఈ వీడియో చూడండి. కారు జాగ్రత్తగా నడపండి.

అతి వేగం ప్రమాదకరమని గుర్తించండి.

తాగిన మత్తులో వాహనాలు నడపడం అంటే ఎదుటివారి జీవితాలతో ఆడుకోవడమే. దయచేసి మద్యం మత్తులో వాహనాలు నడపకండి.

గతంలో ఇలాంటి ప్రమాదాలే చాలా జరిగాయి… ఇప్పుడూ జరుగుతున్నాయి…. దయచేసి భవిష్యత్తులో జరగకుండా చూడండి.

ప్రజాప్రయోజనార్థం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన వీడియోను సత్యం న్యూస్ మీకు అందిస్తున్నది.

Related posts

కాట్రగడ్డ విమలాదేవి 4వ వర్ధంతి

Satyam NEWS

శారదా శక్తి పీఠం సందర్శనకు ప్రయత్నాలు

Murali Krishna

బ్యాంక్ రుణాలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment