37.2 C
Hyderabad
April 30, 2024 11: 13 AM
తెలంగాణ

మనోధైర్యం ఇచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

kollapur 46

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త, తన ముఖ్య అనుచరుడు అయిన డి. వీరస్వామి తండ్రి దొడ్డి వెంకటయ్య అకాల మరణానికి మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వీరాస్వామి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు. కొల్లాపూర్ పట్టణం ఇందిరా కాలనీకి చెందిన డి.వీరస్వామి తండ్రి గత వారం మృతి చెందారు. ఆయన కొద్ది కాలంగా  అనారోగ్యానికి గురై మరణించారు. దినాల సందర్భంగా శనివారం ఉదయం  9 గంటల సమయంలో వీరస్వామి కుటుంబాన్ని జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. దొడ్డి వెంకటయ్య (70) నైట్ వాచ్ మెన్ గా  విధులు నిర్వహిస్తూ మూడు నెలల క్రితం రిటైర్ అయ్యారు. ప్రభుత్వ నుంచి రావాల్సిన ఆర్థిక లావాదేవీలు పూర్తికాకపోవడంతో చింతించి  అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్యం వికటించటంతో ఇంటి దగ్గర మృతి చెందారని పెద్ద కుమారుడు వీరస్వామి తెలిపాడు. వీరాస్వామితో బాటు లింగస్వామి, కిషోర్, గోపాల్ మనవడు కృష్ణ తదితరులను జూపల్లి కృష్ణారావు పరామర్శించి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక లావాదేవీలను వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. దినాల ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం పట్టణ కేంద్రంలో బండయ్యా గుట్ట టిటిడి కళ్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించారు. మూడు కోట్ల బడ్జెట్ తో 2017 ఏప్రిల్ 4న అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  జూపల్లి కృష్ణారావు గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శిలాఫలకాన్ని వేశారు. ఈ పనులకు కొద్దిగా అంతరాయం కలిగింది. ఈ మధ్యలో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. నాణ్యమైన పరికరాలతో నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు జూపల్లి ఆదేశించారు. కార్యక్రమంలో బోరెల్లి మహేష్, వెంకటేష్, నయీమ్, ఎండి ప్రిన్సి బాబా ఇందిరకాలని, బండాయగుట్ట కాలనీ వాసులు  జూపల్లి వెంట ఉన్నారు.

Related posts

ప్రధాని మోదీతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ

Satyam NEWS

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

పల్లె ప్రగతిలో విద్యుత్ శాఖ మెరుపులు

Satyam NEWS

Leave a Comment