మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో కదలికలు ఏర్పడినట్లు వార్తలు వింటుంటాం. ఓ మనిషి చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించిన తర్వాత ఆ వ్యక్తి ప్రాణాలతో తిరిగొస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన కరాచీలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళ కరాచీలోని అబ్బాసీ షాహిద్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది.
రషీదా బీబీ చనిపోయినట్లుగా డాక్టర్లు ఆమె కుటుంబసభ్యులకు మరణ ధృవీకరణ పత్రం జారీచేశారు.ఆ తర్వాత రషీదా బీబీ డెడ్‌బాడీని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల్లో భాగంగా రషీదా భౌతికకాయానికి ఓ మహిళ స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా ఆమె దేహంలో కదలిక వచ్చింది. ఆ మహిళ బయటకు వచ్చి కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
డాక్టర్లు వచ్చి ఆమె పల్స్ చెక్ చేయగా రషీదా బీబీ ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే రషీదా బీబీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.